
రజత్ పటీదార్ అరంగేట్రం..
ఈ క్రమంలోనే జట్టు కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లేయర్ రజత్ పటీదార్.. సౌతాఫ్రికాతో జరిగే తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలు బాదాడు.
ఐపీఎల్‌లోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి గబ్బర్ సేనలో అవకాశం దక్కనుంది. అయితే రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో అతనికి తీవ్ర పోటీ ఎదురుకానుంది. సీనియర్‌కు ప్రాధానత్య ఇవ్వాలని భావిస్తే ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు. అప్పుడు రజత్ పటీదార్ వేచి చూడాల్సి ఉంటుంది.

ఓపెనర్లుగా ధావన్, శుభ్‌మన్..
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఆడటం ఖాయం. ధావన్ కెప్టెన్ కావడంతో పాటు జట్టులో అత్యంత సీనియర్. ఇక శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని వన్డే ప్రపంచకప్ కోసం సిద్దం చేస్తున్నారు. అంతేకాకుంగా వెస్టిండీస్ పర్యటనలో అతను సత్తా చాటాడు. ఫస్ట్ డౌన్‌లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. టీ20 ప్రపంచకప్ స్టాండ్‌బై లిస్ట్‌లో ఉన్న అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అందించనున్నారు. నాలుగో స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ బరిలోకి దిగడం ఖాయం. ఇటీవలే న్యూజిలాండ్-ఏతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా సంజూ అదరగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు.

ఆల్‌రౌండర్లుగా శార్దూల్, షెహ్‌బాజ్..
ఐదో స్థానం కోసం రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్‌లు పోటీపడుతున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా షెహ్‌బాజ్ అహ్మద్ ఆడటం ఖాయం. లెఫ్టాండర్ కావడం, బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటం అతనికి అదనపు బలం. పైగా రవీంద్ర జడేజా గాయపడగా.. అక్షర్ పటేల్ టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండటంతో అతనికి లైన్ క్లియర్ అయ్యింది. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. ఇండియా ఏ జట్టు తరఫున అతను సత్తా చాటాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు.

సిరాజ్, చాహర్..
పేసర్లుగా దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్‌లు ఆడనుండగా.. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నారు. సిరాజ్, దీపక్ చాహర్‌లు టీ20 ప్రపంచకప్ జట్టు స్టాండ్‌బైలో ఉండటంతో వారికి వరుసగా అవకాశాలు ఇవ్వనున్నారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా సిరాజ్‌ను సిద్దం చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో విఫలమైతే.. సిరాజ్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. కాబట్టి ఈసిరీస్‌లో రాణించడం అతనికి చాలా ముఖ్యం. ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోవాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ ప్లేస్‌లో ఆవేశ్ ఖాన్ ఆడొచ్చు.

తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), రజత్ పటీదార్/ఇషాన్ కిషన్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్


Click it and Unblock the Notifications












