Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11: సిరాజ్ ఇన్.. హర్షల్ ఔట్! రోహిత్ డౌట్! మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs South Africa For 3rd T20I: Mohammed Siraj In and Rohit Sharma Doubt

హైదరాబాద్: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలిచిన టీమిండియా ఆఖరి పోరుకుసిద్దమైంది. పరుగుల వర్షం కురిసిన రెండో టీ20లో బ్యాటింగ్ బలంతో గట్టెక్కిన టీమిండియా.. బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టింది. మంగళవారం నాగ్‌పూర్ వేదికగా జరగనున్న మూడో టీ20 కోసం సమయాత్తం అవుతోంది. ఈ సిరీస్‌లో గెలిచినా.. బౌలింగ్ వైఫల్యం టీమిండియా కలవరపెడుతోంది. ఇప్పటికే సిరీస్ నెగ్గడంతో మూడో టీ20లో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. దాంతోనే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తినెలకొంది.

 రోహిత్ శర్మ డౌట్..

రోహిత్ శర్మ డౌట్..

ఇక రెండో టీ20లో కాస్త అసౌకర్యంగా కనిపించిన రోహిత్ శర్మ.. మూడో టీ20 ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. బ్యాటింగ్ సందర్భంగా స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ ఎడమ మణికట్టుకు బంతి బలంగా తాకింది. ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేయడంతో తన ఆటను కొనసాగించాడు. ఇక ఫీల్డింగ్ సందర్భంగా కూడా రోహిత్ అసౌకర్యంగా కనిపించాడు. మైదానంలో ఉన్న ఉక్కపోత కారణంగా అతని ముక్కులో నుంచి రక్తం కారింది. కాస్త బ్రేక్ తీసుకొని మళ్లీ బరిలోకి దిగాడు. ఈ క్రమంలోనే రోహిత్‌‌కు విశ్రాంతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ రెస్ట్ తీసుకుంటే రాహుల్ జట్టును నడపించనున్నాడు.

సిరాజ్ ఇన్.. హర్షల్ ఔట్..

సిరాజ్ ఇన్.. హర్షల్ ఔట్..

ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న సిరాజ్‌ను హుటాహుటినా భారత్‌కు రప్పించింది. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా అతని సిద్దం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. కానీ రెండో టీ20లో బెంచ్ పరిమితం చేసింది. సిరీస్ గెలిచిన నేపథ్యంలో అతనికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. అయితే అతన్ని ఎవరి ప్లేస్‌లో ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ నుంచి ఆడుతున్న హర్షల్ పటేల్‌‌కు రెస్ట్ ఇచ్చి సిరాజ్‌ను తీసుకునే అవకాశం ఉంది.

సూర్యకు రెస్ట్..

సూర్యకు రెస్ట్..

ఈ సిరీస్‌లో సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతని స్టానంలో స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను ఆడించనున్నారు. ఈ మ్యాచ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన పంత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలోనే అతన్ని నాలుగో స్థానంలో ఆడించే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ ప్లేస్‌కు డోకా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చాహల్‌కు బదులు మరోసారి అశ్వినే ఆడనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఎక్కువ లెఫ్టాండర్స్ ఉండటంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అశ్విన్‌వైపు మొగ్గు చూపనుంది. చాహల్‌ను ఆడించాలనుకుంటే మాత్రం అశ్విన్‌కు ఉద్వాసన తప్పదు.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్/మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్/యుజ్వేంద్ర చాహల్

Story first published: Monday, October 3, 2022, 15:17 [IST]
Other articles published on Oct 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+