
పాపం యువ ఆటగాళ్లు..
సిరీస్ గెలవడమే లక్ష్యంగా ఉన్న ధావన్ సేన.. ఫైనల్ మ్యాచ్‌కు పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలోని టీమ్‌మేనేజ్‌మెంట్.. ఎలాంటి ప్రయోగాలు చేయకపోవచ్చు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకొని ఉంటే.. చివరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేవారు. కానీ తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో సిరీస్ డిసైడర్‌కు దారి తీసింది. ఈ క్రమంలోనే విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించేందుకే ధావన్ సేన మొగ్గు చూపనుంది. ఇదే జరిగితే యువ ఆటగాళ్లకు మరోసారి నిరాశే ఎదురుకానుంది.

రాహుల్ త్రిపాఠి అంతటి...
ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియా పిలుపును అందుకున్న రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠి, ముకేశ్ కుమార్‌లు టీమిండియాకు ఆడకుండానే వెనుదిరగనున్నారు. తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా అవకాశం దక్కేలా లేదు. ఇక రాహుల్ త్రిపాఠి అంతటి దురదృష్టవంతులు లేడనే చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనతో తొలి జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనలకు ఎంపికైన రాహుల్ త్రిపాఠి.. అక్కడా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కనీసం సొంతగడ్డపై అయినా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే కల నెరవేరుతుందని భావించిన అతనికి మరోసారి నిరాశే ఎదురైంది.

బిష్ణోయ్ రీఎంట్రీ..
తొలి వన్డేలో విఫలమైన రవి బిష్ణోయ్‌ను చివరి మ్యాచ్‌కు తీసుకుంటే తీసుకోవచ్చు. టీ20 ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే.. షెహ్‌బాజ్ అహ్మద్‌పై వేటు పడనుంది. రెండో వన్డేతోనే షెహ్‌బాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన షెహ్‌బాజ్(1/54)జ్.. ఒక వికెట్ తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీపక్ చాహర్ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ సైతం(1/60) ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఇద్దరి స్థానాల్లో బిష్ణోయ్‌ని బరిలోకి దించే అవకాశం ఉంది.

మిగతా జట్టులో మార్పుల్లేవ్..
ఆ ఒక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇక ఓపెనర్లుగా గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటాల్సి ఉంది. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అద్భుత భాగస్వామ్యంతో చెలరేగడంతో వారి స్థానాలకు ఎలాంటి డోకా లేదు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఇషాన్ కిషన్.. తన సొంతగడ్డపై దుమ్మురేపాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఐదో స్థానంలో సంజూ శాంసన్ ఆడనుండగా.. ఎనిమిదో స్థానంలో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగనున్నాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్‌లు ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడటం ఖాయం.

తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), షెహ్‌బాజ్ అహ్మద్/రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్


Click it and Unblock the Notifications












