Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11: సిరాజ్ ఇన్.. పంత్ ఔట్! సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs South Africa For 2nd T20I: Mohammed Siraj In and Jasprit Bumrah Out

హైదరాబాద్: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరులో మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకుంటున్న టీమిండియా లోపాలను సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టింది. తొలి టీ20లో అద్భుత బౌలింగ్‌తో విజయాన్నందుకున్న రోహిత్ సేన.. ఆదివారం గౌహతి వేదికగా జరగనున్న రెండో టీ20 కోసం సమయాత్తం అవుతోంది. ఇక వెన్ను నొప్పితో తొలి మ్యాచ్ ఆడని బుమ్రా.. ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌‌ను ఎంపిక చేశారు. బుమ్రా ప్రపంచకప్‌ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మెగో టోర్నీకి సిరాజ్‌ను సిద్దం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది.

సిరాజ్ ఇన్.. పంత్ ఔట్..

సిరాజ్ ఇన్.. పంత్ ఔట్..

ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న సిరాజ్‌ను హుటాహుటినా భారత్‌కు రప్పించింది. శుక్రవారమే జట్టుతో కలిసిన సిరాజ్.. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే బుమ్రా స్థానంలో తొలి మ్యాచ్ ఆడిన దీపక్ చాహర్ దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే సిరాజ్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. మూడు వికెట్లతో సత్తా చాటిన అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షల్ పటేల్‌లను పక్కనపెట్టలేని పరిస్థితి. ఈ ఇద్దరూ ప్రపంచకప్ ప్రధాన జట్టులో ఉండటంతో వారిని వీలైనన్ని మ్యాచ్‌లు ఆడించనున్నారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న సిరాజ్ స్కిల్ టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దీపక్ చాహర్‌ను పక్కనపెట్టవచ్చు. లేదా రిషభ్ పంత్‌ను పక్కనపెట్టి నలుగురు పేసర్లతో బరిలోకి దిగవచ్చు.

ఎక్స్‌ట్రా బ్యాటరా? బౌలరా?

ఎక్స్‌ట్రా బ్యాటరా? బౌలరా?

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో తొలి టీ20 ఆడిన టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించింది. మరీ సిరాజ్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో ఇదే ఫార్మూలతో బరిలోకి దిగుతుందా? లేక ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకుంటుందా? అనేది చూడాలి. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో హార్దిక్ ఉండటంతో రిషభ్ పంత్‌ను పక్కనపెట్టిన టీమ్‌మేనేజ్‌మెంట్ సఫారీ టీమ్‌తో మాత్రం అవకాశం కల్పించింది. అయితే నలుగురు పేసర్లను తీసుకుంటే మాత్రం పంత్‌ను పక్కనపెట్టవచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ ప్లేస్‌కు డోకా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చాహల్‌కు బదులు మరోసారి అశ్వినే ఆడనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఎక్కువ లెఫ్టాండర్స్ ఉండటంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అశ్విన్‌వైపు మొగ్గు చూపనుంది.

 బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..

బ్యాటర్లు అదరగొడుతుండటంతో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. తొలి టీ20లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అదరగొట్టారు. అద్భుతంగా ఆడి విజయాన్నందించారు. ఆసీస్ సిరీస్‌లో దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా తన సత్తా ఏంటో తెలియజేశాడు. కాబట్టి అతని ప్లేస్‌కు డోకా లేదు. హార్దిక్ గైర్హాజరీలో ఈ ఐదుగురు బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్/దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్

Story first published: Saturday, October 1, 2022, 15:13 [IST]
Other articles published on Oct 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+