For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: దీపక్ చాహర్ ఇన్.. ఆవేశ్ ఖాన్ ఔట్! సౌతాఫ్రికాతో రెండో వన్డే ఆడే గబ్బర్ సేన ఇదే!

 India Playing XI vs South Africa For 2nd ODI: Deepak Chahar Likely To Replace Avesh Khan

హైదరాబాద్: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అడ్డా రాంచీ వేదికగా ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సిరీస్‌ గెలవాలంటే గబ్బర్ సేన ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. లేకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్‌కు ఈ మ్యాచ్ డూఆర్‌డై మారింది. మరోవైపు తొలి వన్డే విజయంతో రెట్టించిన ఆత్మవిశ్వాసం అందుకున్న సౌతాఫ్రికా జట్టు.. ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డే తృటిలో విజయాన్ని కోల్పోయిన భారత్.. తప్పులు సరిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.

 దీపక్ చాహర్ ఇన్.. ఆవేశ్ ఖాన్ ఔట్!

దీపక్ చాహర్ ఇన్.. ఆవేశ్ ఖాన్ ఔట్!

బౌలింగ్ విభాగాన్ని బలంగా మార్చేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ ఆవేశ్ ఖాన్‌పై వేటు వేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో ఆవేశ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. ధారళంగా పరుగులివ్వడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక సమయంలో ఘోర తప్పిదం చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. క్రీజులోసెట్ అయిన సంజూకు స్ట్రైక్ ఇవ్వకుండా ఓ ఓవర్ మొత్తం వృథా చేశాడు. ఇది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టి పవర్ ప్లేలో సత్తా చాటగల దీపక్ చాహర్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకోనుంది. బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం కూడా అతనికి కలిసొచ్చే అంశం కాగా.. టీ20 ప్రపంచకప్ రిజర్వ్ ప్లేయర్ కావడం మరో కారణం.

ఓపెనర్లుగా ధావన్, గిల్..

ఓపెనర్లుగా ధావన్, గిల్..

ఇక ఓపెనర్లుగా గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటాల్సి ఉంది. ఈ ఇద్దరూ వరుసగా ఔటవ్వడం గత మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమైంది. ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. నాలుగో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్ కూడా మెప్పించలేకపోయాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతన్ని కూడా కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మాత్రం రజత్ పటీదర్‌కు అవకాశం ఇస్తారు.

ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్..

ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్..

ఐదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. ఆరో స్థానంలో ఆడిన వికెట్ కీపర్ సంజూ శాంసన్ తనదైన ఇన్నింగ్స్‌తో గెలిపించినంత పని చేశాడు. కానీ చివర్లో స్ట్రైకింగ్ రాక విజయ లాంఛనాన్ని పూర్తి చేయలేకపోయాడు. అయితే వికెట్ కీపింగ్‌లో అతను మెరుగుపడాల్సి ఉంది. తొలి వన్డేలోకీపర్‌గా అనేక తప్పిదాలు చేశాడు. ఏడో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగుతాడు. తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌తో దుమ్మురేపిన శార్దూల్.. విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. అతను కీలక సమయంలో ఔటవ్వడం సఫారీలకు కలిసొచ్చింది.

రవి బిష్ణోయ్ డౌట్

రవి బిష్ణోయ్ డౌట్

తొలి వన్డేలో పెద్దగా ప్రభావం చూపని రవి బిష్ణోయ్‌ను కూడా పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతన్ని పక్కనపెడితే జట్టులోకి షెహ్‌బాజ్ అహ్మద్ వస్తాడు. లేదంటే బిష్ణోయ్ ఆడుతాడు. పేసర్లుగా దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్‌లు ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడటం ఖాయం. తొలి వన్డేలో సిరాజ్ వికెట్ తీయకపోయినా.. కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. కుల్దీప్ తన సత్తా ఏంటో చూపించాడు.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్

Story first published: Saturday, October 8, 2022, 7:01 [IST]
Other articles published on Oct 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+