For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing 11: అర్ష్‌దీప్ సింగ్ ఇన్.. పంత్ డౌట్! సౌతాఫ్రికాతో ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs Australia For 1st T20I: Arshdeep Singh In and Rishabh Pant Doubt

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ను గెలిచిన టీమిండియా అదే జోరులో మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు ఉన్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకు సమయాత్తమైంది. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరగనున్న తొలి టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది.

తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. లోపాలను సరిదిద్దుకోవడంపై రోహిత్ సేన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ బలహీనతలను అధిగమించడంపై ప్రత్యేక దృష్టిసారించింది. వర్క్‌లోడ్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా.. అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అర్ష్‌దీప్ సింగ్? దీపక్ చాహర్

అర్ష్‌దీప్ సింగ్? దీపక్ చాహర్

భువనేశ్వర్ గైర్హాజరీలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశమిస్తారా? లేక అతని బౌలింగ్ శైలి కలిగి ఉండే దీపక్ చాహర్‌ను ఎంచుకుంటారా? అనేది చూడాలి. అయితే టీ20 ప్రపంచకప్ ప్రధాన జట్టులో ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌కే టీమ్‌మేనేజ్‌మెంట్ ఓటు వేయవచ్చు. ఎందుకంటే ఆసియాకప్ నుంచి టీమిండియా డెత్ బౌలింగ్ దారుణంగా తయారయ్యింది.

హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా తిరిగొచ్చినా పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలోనే యార్కర్లు కట్టుదిట్టంగా వేసే అర్ష్‌దీప్ సింగ్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తుంది. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వస్తే.. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌తో కలిసి పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. మరోవైపు మహమ్మద్ షమీ గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆసీస్‌తో చివరి మ్యాచ్‌లో హర్షల్ రిథమ్ అందుకున్నాడు. కాబట్టి అతన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఎక్స్‌ట్రా బ్యాటరా? బౌలరా?

ఎక్స్‌ట్రా బ్యాటరా? బౌలరా?

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో టీమిండియా అదనపు బ్యాటర్‌తో బరిలోకి దిగుతుందా? లేక బౌలర్‌ను బరిలోకి దింపుతుందా? అనేది చూడాలి. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన దీపక్ హుడా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు బీసీసీఐనే ప్రకటించింది. అతను ఈ సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు వార్తలు వచ్చినా.. బీసీసీఐ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న అతను తొలి మ్యాచ్ ఆడకపోవచ్చు. అదే జరిగితే టీమిండియా రిషభ్ పంత్, అశ్విన్‌లలో ఒకరిని తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా బౌలర్ కావాలనుకుంటే అశ్విన్.. బ్యాటర్ అయితే పంత్‌ను కొనసాగించవచ్చు.

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..

ఆసీస్‌‌తో సిరీస్‌లో బ్యాటర్లు అదరగొట్టడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్‌లో రాణించినా ఆ తర్వాత విఫలమయ్యాడు. అతను కాస్త నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది.

దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా తన సత్తా ఏంటో తెలియజేశాడు. హార్దిక్ గైర్హాజరీలో ఈ ఐదుగురు బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. పంత్ జట్టులోకి వస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా లభిస్తుంది. కానీ బౌలింగ్ బలహీనంగా మారనుంది. అశ్విన్ తీసుకొస్తే బ్యాటింగ్ డెప్త్ మిస్సయ్యే ప్రమాదం ఉంది. ఇక స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, చాహల్ స్థానాలకు డోకా లేదు. చాహల్ చివరి మ్యాచ్‌లో రిథమ్ అందుకున్నాడు.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా/రిషభ్ పంత్/రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Tuesday, September 27, 2022, 18:55 [IST]
Other articles published on Sep 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+