Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ముగ్గురికి నిరాశే! సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs SA for 2nd T20I: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియాకు వర్షం ఊహించని షాకిచ్చింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఆట సాధ్యమవ్వలేదు.

దాంతో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలి మ్యాచ్‌ను వర్షం మింగేసినా రెండో టీ20 కోసం టీమిండియా సిద్దమవుతోంది. మంగళవారం జిక్యూబెర్హా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.

India Playing XI vs South Africa 2nd T20I: No Ruturaj Gaikwad, Tilak Varma and Ishan Kishan

తొలి టీ20 కోసం ఎంపిక చేసిన జట్టునే దాదాపు రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించనున్నారు. ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ,జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

వన్డే ప్రపంచకప్ అనంతరం రెస్ట్ తీసుకున్న శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఈ టీ20 సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో టీమిండియా తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు తలనొప్పిగా మారింది. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో పాటు తిలక్ వర్మ‌ను ఆడించలేని పరిస్థితి నెలకొంది.

శ్రేయస్ అయ్యర్ జట్టులోకి రావడంతో తిలక్ వర్మకు దారులు మూసుకుపోయాయి. ఓపెనింగ్ స్లాట్‌తో పాటు మిడిలార్డర్‌లో చోటు లేకపోవడంతో ఇషాన్ కిషన్‌ను కూడా ఆడించలేని పరిస్థితి నెలకొంది. శుభ్‌మన్ గిల్‌ రీఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా పక్కనపెట్టాల్సి వస్తోంది.

లోయరార్డర్‌లో జితేశ్ శర్మ నిలకడగా ఆడుతుండటంతో ఇషాన్ కిషన్ కంటే అతనికే వికెట్ కీపర్ ప్రాధాన్యత దక్కనుంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే మాత్రం జితేశ్ శర్మ బెంచ్‌కు పరిమితమవుతాడు.

India Playing XI vs South Africa 2nd T20I: No Ruturaj Gaikwad, Tilak Varma and Ishan Kishan

బ్యాటింగ్ ఆర్డర్ ఏంటేంటే..?:వన్డే ప్రపంచకప్ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్న శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా యశస్వీ జైస్వాల్ ఆడనున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో జితేశ్ శర్మ బరిలోకి దిగనున్నాడు.

వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కు ప్రాధాన్యత ఇస్తే.. జితేశ్ శర్మ బెంచ్‌కు పరిమితమవుతాడు. అప్పుడు ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆరో స్థానంలో రింకూ సింగ్ బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు.

బౌలింగ్ కాంబినేషన్ ఏంటంటే..?:స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌, రవి బిష్ణోయ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరికి చోటు దక్కనుంది. బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న రవి బిష్ణోయ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పేస్ విభాగాన్ని మహమ్మద్ సిరాజ్ లీడ్ చేయనుండగా.. అతనికి అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్‌లు అండగా నిలవనున్నారు.

భారత తుది జట్టు(అంచనా):
శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్/జితేశ్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్/ కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్.

భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

Story first published: Monday, December 11, 2023, 15:09 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+