
అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు..
అనారోగ్యంతో తొలి టీ20కి దూరమైన అర్ష్‌దీప్ సింగ్ రెండో టీ20లో బరిలోకి దిగాడు. కానీ పేలవ ప్రదర్శనతో జట్టు ఓటమికి కారణమయ్యాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేక రిథమ్ కోల్పోయిన అర్ష్‌దీప్ సింగ్ రెండు ఓవర్లు మాత్రమే వేసి 5 నోబాల్స్ వేసాడు. ఈ నోబాల్స్ భారత ఓటమిని శాసించాయి. ఇందులో హ్యాట్రిక్ నోబాల్స్ ఉండటం అందర్నీ విస్మయపరిచింది. గల్లీ క్రికెటర్ కూడా ఈ స్థాయి నోబాల్స్ వేయడనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టే అవకాశాలున్నాయి. మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శనపై హర్దిక్ పాండ్యా పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. బేసిక్ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నామని హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు.

సుందర్‌కు అవకాశం..
అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో ఎక్స్‌ట్రా స్పిన్నర్ తీసుకునే అవకాశాలున్నాయి. రాజ్ కోట్ పిచ్ కూడా పుణే మాదిరి ఫ్లాట్‌గా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ డెప్త్ కోసమే కుల్దీప్‌ను కాదని సుందర్‌ను ఆడించే అవకాశం ఉంది. పేసరే కావాలనుకుంటే యువ ప్లేయర్ ముఖేశ్ కుమార్ అరంగేట్రం చేయవచ్చు. లేదంటే హర్షల్ పటేల్‌ను మళ్లీ జట్టులోకి కూడా తీసుకురావచ్చు. అర్ష్‌దీప్ సింగ్‌కు అండగా నిలిచి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం అతనే జట్టులో ఉంటాడు.

శుభ్‌మన్ గిల్ ఔట్..
వరుసగా రెండు టీ20ల్లో విఫలమైన శుభ్‌మన్ గిల్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌తోనే టీ20 ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన శుభ్‌మన్ 7 పరుగులతో వెనుదిరగ్గా.. రెండో టీ20లోనూ 5 పరుగులకే ఔటయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. శుభ్‌మన్ గిల్ స్థానంతో రుతురాజ్ గైక్వాడ్‌ను తీసుకునే అవకాశాలున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన రుతరాజ్‌కే మొదటి ప్రాధాన్యత లభిస్తుందని భావించినా.. హార్దిక్ మాత్రం శుభ్‌మన్‌కు అవకాశమిచ్చాడు. అయితే చివరి టీ20లో రుతురాజ్‌ను తప్పక ఆడించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇషాన్ కిషన్‌తో కలిసి అతను ఓపెనింగ్ చేయనున్నాడు.

రాహుల్ త్రిపాఠికి మరో చాన్స్!
రెండో టీ20తో అరంగేట్రం చేసిన రాహుల్ త్రిపాఠి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వవచ్చు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. దీపక్ హుడా ఆరో స్థానంలో ఆడనుండగా.. అక్షర్ పటేల్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ సిరీస్‌లో అక్షర్ పటేల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పేసర్లు ఉమ్రాన్ మాలిక్, శివం మావి స్థానాలకు డోకాలేదు. రెండో టీ20లో పర్వాలేదనిపించిన యుజ్వేంద్ర చాహల్ కూడా కొనసాగనున్నాడు.

భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్/హర్షల్ పటేల్/ముఖేశ్ కుమార్/వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












