
సూర్య, ఇషాన్ కిషన్ ఇన్..
'ఈ సిరీస్ అనంతరం న్యూజిలాండ్‌తో మేం మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాం. కాబట్టి మా ఆటగాళ్లను ఫ్రెష్‌గా ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది మాకు లాంగ్ సీజన్ ఉంది. కాబట్టి ప్రతీ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం అనిపిస్తే మేం తుది జట్టులో మార్పులు చేస్తాం'అని రెండో వన్డే విజయానంతరం మాట్లాడుతూ.. చివరి మ్యాచ్ మార్పులు గురించి హింట్ ఇచ్చాడు. రోహిత్ చెప్పినట్లు మార్పులు చేస్తే.. టీమిండియా 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్, డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వస్తారు. శ్రీలంకతో మూడో టీ20లో సూర్య విధ్వంసకర సెంచరీ బాదినా.. తొలి రెండు వన్డేల్లో అవకాశం అందుకోలేకపోయాడు. ఇక బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్‌కు కూడా చోటివ్వలేదు. ఈ ఇద్దర్ని పక్కనపెట్టడంపై విమర్శలు వచ్చాయి. నామమాత్రమైన చివరి వన్డేలో ఈ ఇద్దరు బరిలోకి దిగే అవకాశం ఉంది.

శుభ్‌మన్, శ్రేయస్ ఔట్..
సూర్య, ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లపై వేటు పడనుంది. తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించిన శుభ్‌మన్ రెండో వన్డేలో విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటలేకపోయాడు. ఈ క్రమంలోనే ఈ ఇద్దర్ని పక్కనపెట్టి సూర్య, ఇషాన్‌లను ఆడించే అవకాశం ఉంది. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఆడటం ఖాయం. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతాడు. టీ20 ఫార్మాట్‌కు ఈ ఇద్దరిని పూర్తిగా దూరం పెట్టడంతో వన్డే ఫార్మాట్‌లో ప్రపంచకప్ వరకు ప్రతీ మ్యాచ్ ఆడనున్నారు. రెండో వన్డేలో రాణించిన కేఎల్ రాహుల్ చోటుకు కూడా డోకా లేదు.

హార్దిక్ పాండ్యాకు రెస్ట్..
ఫినిషర్ కమ్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అతను జట్టును నడిపించనున్న నేపథ్యంలో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న హార్దిక్‌కు ఈ మ్యాచ్ నుంచి మినహాయింపు లభించనుంది. అదే జరిగితే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడు. తిరువనంతపురం పిచ్ గ్రీన్ వికెట్ కావడంతో టీమిండియా ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే అక్షర్ పటేల్ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఎక్స్‌ట్రా పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

మహమ్మద్ షమీకి రెస్ట్..
సీనియర్ పేసర్ అయిన మహహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న షమీ సైతం విరాట్, రోహిత్‌లా ప్రపంచకప్ వరకు ప్రతీ వన్డే ఆడే అవకాశం ఉంది. మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ తమ స్థానాలను రిటైన్ చేసుకోనున్నారు. రెండో వన్డేలో సంచలన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి. చాహల్ ఫిట్ అయితే కుల్దీప్‌ను కొనసాగిస్తారా? లేదో చూడాలి.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, ఇషన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా/వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్/అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్/యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












