Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: శ్రీలంకతో రెండో వన్డే ఆడే జట్టు ఇదే.. ఆ ముగ్గురికి మళ్లీ నిరాశే!

India Playing XI vs SL 2nd ODI: No chance for Suryakumar Yadav And Ishan Kishan

కోల్‌కతా: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం జరగనున్న రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

తద్వారా మూడో వన్డేలో బెంచ్ బలాన్ని పరీక్షించాలనుకుంటుంది. మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి సిరీస్ రేసులో నిలవాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే టీమిండియా కాంబినేషన‌లో ఏమైనా మార్పులు ఉంటాయా? అనే చర్చ కూడా నడుస్తోంది.

మళ్లీ నిరాశే..

మళ్లీ నిరాశే..

డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్.. సెంచరీ హీరో సూర్యకుమార్ యాదవ్ లేకుండానే తొలి వన్డే బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ బ్యాటర్ల వీరవిహారంతో అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ ఇద్దరికి తోడు బంగ్లాదేశ్ పర్యటనలో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్‌కు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

అయితే తుది జట్టులో 11 మంది ఆటగాళ్లనే ఆడించే అవకాశం ఉండటంతో టీమ్ కాంబినేషన్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. తొలి వన్డేలో అందరూ అద్భుతంగా రాణించడంతో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. దాంతో సూర్య, ఇషాన్, కుల్దీప్ యాదవ్‌లకు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది.

అయ్యర్‌కు మరో చాన్స్..

అయ్యర్‌కు మరో చాన్స్..

ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ తొలి వన్డేలో సత్తా చాటారు. తొలి వికెట్‌కు ఏకంగా 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసారు. ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేయడంతో రెండో వన్డేలో కూడా ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. మూడో స్థానంలో బరిలోకి దిగిన కింగ్ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు.

మళ్లీ పాత కోహ్లీలా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ విఫలమైనా.. అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. కేఎల్ రాహుల్ తక్కువ పరుగులే చేసినా.. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. మిడిల్ ఓవర్లలో అండగా నిలిచాడు. కాబట్టి అతని ప్లేస్‌కు కూడా డోకాలేదు.

అక్షర్ పటేల్ డౌట్..

అక్షర్ పటేల్ డౌట్..

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విఫలమైనా.. వైస్ కెప్టెన్ అయిన అతన్ని తీసేసే సాహసం టీమిండియా చేయదు. బౌలింగ్‌లో హార్దిక్ కీలకం కాబట్టి అతన్ని పక్కనపెట్టదు. అక్షర్ పటేల్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే అతనికి కూడా మరో అవకాశం ఇవ్వవచ్చు. ఒకవేళ పక్కన పెట్టాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వస్తాడు.

తొలి వన్డేలో సత్తా చాటిన పేసర్లు మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌, మహమ్మద్ షమీల ప్లేస్‌లకు డోకా లేదు. యుజ్వేంద్ర చాహల్ తన మార్క్ కనబర్చలేదు. అతన్ని పక్కనపెట్టాలనుకుంటే కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వస్తాడు.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్

Story first published: Wednesday, January 11, 2023, 15:05 [IST]
Other articles published on Jan 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+