For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: శుభ్‌మన్, దీపక్ హుడాకు నో చాన్స్.. శ్రీలకంతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

 India Playing XI vs SL 1st T20: No chance for Shubman Gill and Deepak Hooda

హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనతో 2022కు గుడ్‌బై చెప్పిన టీమిండియా.. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌తో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం(జనవరి 3) వాంఖడే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో యువ జట్టు ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఈ సిరీస్‌తోనే సన్నాహకం మొదలుపెట్టనుంది. సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అవకాశాలు అందుకోనున్నారు. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్..

ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్..

రోహిత్ శర్మ గైర్హాజరీలో అతని స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయనుండగా.. మరో ప్లేస్ కోసం రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి పోటీ పడుతున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. రంజీ ట్రోఫీలో మరో సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20లతో పాటు వన్డేల్లోనూ ఇషాన్ కిషన్‌కు వరుస అవకాశాలు దక్కనున్నాయి. అయితే రెండో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్? అనేది కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయించనున్నారు. శుభ్‌మన్ గిల్‌కు ఎక్కువ అవకాశాలున్నా.. టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌తో అతనికి తీవ్ర పోటీ నెలకొంది.

మిడిలార్డర్‌లో సూర్య, సంజూ, హార్దిక్

మిడిలార్డర్‌లో సూర్య, సంజూ, హార్దిక్

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. మూడో స్థానంలో బరిలోకి దిగనుండగా.. సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా అతనితో మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. 2022లో టీ20 ఫార్మాట్‌లో తనదైన బ్యాటింగ్ చెలరేగిన సూర్య.. కొత్త ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. పైగా వైస్ కెప్టెన్సీ ప్రమోషన్ అందుకున్న అతను మరింత ఉత్సాహంగా ఉన్నాడు. అవకాశం కోసం నిరీక్షిస్తున్న సంజూ శాంసన్ కూడా ఈ సిరీస్‌ను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫినిషర్‌ పాత్ర పోషించనున్నాడు.

 ఆల్‌రౌండర్లుగా సుందర్, అక్షర్..

ఆల్‌రౌండర్లుగా సుందర్, అక్షర్..

వాషింగ్టన్ సుందర్ రాకతో దీపక్ హుడా బెంచ్‌‌కే పరిమితం కానున్నాడు. సుందర్‌తో కలిసి అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. తొలి టీ20 జరిగే వాంఖడే బ్యాటింగ్‌కు అనుకూలమైన నేపథ్యంలో బ్యాటింగ్ డెప్త్‌తో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఇద్దరికి తోడుగా స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం విశ్రాంతి తీసుకున్న చాహల్.. ఈ సిరీస్‌తో మళ్లీ రిఎంట్రీ ఇవ్వనున్నాడు.

అర్ష్‌దీప్ సింగ్ సారథ్యంలో..

అర్ష్‌దీప్ సింగ్ సారథ్యంలో..

అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్‌‌లు అతనితో పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. టీమిండియా పిలుపును అందుకున్న ముఖేశ్ కుమార్, శివం మావి బెంచ్‌కే పరిమితం కానున్నారు. భవిష్యత్తు నేపథ్యంలోఉమ్రాన్ మాలిక్‌కు వరుస అవకాశాలు ఇవ్వనున్నారు.

 భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, శివం మావి

Story first published: Saturday, December 31, 2022, 19:39 [IST]
Other articles published on Dec 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+