India Playing XI vs SA: ఆవేశ్ ఖాన్ ఔట్.. అర్షదీప్ సింగ్ అరంగేట్రం! నాలుగో టీ20 బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

రాజ్‌కోట్: సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో సత్తా చాటిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. సౌతాఫ్రికాతో రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరగనున్న నాలుగో టీ20కి సన్నదం అవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ రేసులో నిలవాలని రిషభ్ పంత్ సారథ్యంలోని యంగ్ ఇండియా భావిస్తుండగా.. గత మ్యాచ్ ఓటమి నుంచి తేరుకోవాలని సౌతాఫ్రికా ప్రణాళికలు రచిస్తోంది. ఎలాగైనా విజయం సాధించి చివరి మ్యాచ్‌తో సంబంధం లేకుండా సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. వైజాగ్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో యువ పేసర్ ఆవేశ్ ఖాన్ గాయపడటంతో టీమ్ కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.

ఆవేశ్ ఖాన్ ఔట్..
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అవకాశం కల్పించినా యువ పేసర్ ఆవేశ్ ఖాన్ సత్తా చాటలేకపోయాడు. మూడో టీ20లో బౌలర్లందరూ రాణించిన వేళ కూడా ఆవేశ్ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయాడు. తొలి టీ20లో 0/34, రెండో టీ20లో 0/17, మూడో టీ20 0/35తో పేలవ ప్రదర్శన కనబర్చాడు. భువీ, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ సత్తాచాటినా ఆవేశ్ ఖాన్ మాత్రం విఫలమయ్యాడు. దానికి తోడు వైజాగ్ టీ20లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. చేతి వేలికి గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే డగౌట్ చేరాడు. ఈ క్రమంలోనే అతను నాలుగో టీ20కి దూరంకానున్నాడు.

అర్షదీప్ సింగ్ అరంగేట్రం..
ఆవేశ్ ఖాన్ స్థానంలో అర్షదీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆవేశ్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అర్షదీప్ ప్రధాన పోటీదారుడిగా కనిపిస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ జట్టులో ఉన్నప్పటికీ.. అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడనే ఫీలింగ్‌లో ద్రవిడ్ ఉన్నాడు. అంతేకాకుండా డెత్ ఓవర్లలో అర్షదీప్ సింగ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా అతన్ని తయారు చేసుకోవాలనే ఆలోచన టీమిండియా మేనేజ్‌మెంట్ ఉంది. ఈ క్రమంలోనే అతనికి అవకాశం ఇవ్వనుంది.

ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్
తొలి రెండు టీ20ల్లో విఫలమైన యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ కీలక మూడో మ్యాచ్‌లో సత్తా చాటారు. అద్భు త బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లను చెడుగుడు ఆడారు. హాఫ్ సెంచరీలతో మంచి ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ ఇదే జోరు కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.
ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. తొలి టీ20లో అయ్యర్(36) పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అతని ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. నాలుగో స్థానంలో రిషభ్ పంత్ ఆడుతాడు. అతను బ్యాట్ ఝులిపించాల్సి ఉంది.

ఫినిషర్లుగా హార్దిక్, దినేశ్ కార్తీక్..
ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీలో అదరగొట్టి టైటిల్ అందించిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తున్నాడు. తొలి టీ20లో 12 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచి తన ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించిన హార్దిక్.. రెండో మ్యాచ్‌లో విఫలమైనా మూడో మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న మరో ఫినిషర్, వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. చాహల్ లయ అందుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం కాగా.. భువీ, హర్షల్ ఫామ్‌లో ఉన్నారు.

తుది జట్టు(అంచనా):
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్/ ఆవేశ్ ఖాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications