
ఓపెనర్లుగా రాహుల్, రోహిత్..
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాహుల్ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టచ్‌లోకి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు సన్నాహక మ్యాచ్‌ల్లో రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ మెగా పోరులో భారత్ విజయం సాధించాలంటే ఓపెనర్లు ఇద్దరూ మంచి శుభారంభం అందించాలి. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఆసియాకప్ 2022లో సెంచరీ బాదిన విరాట్.. అదే జోరును కొనసాగిస్తున్నాడు.

మిడిలార్డర్ కింగ్ సూర్యనే...
నాలుగో స్థానంలో ఇండియా 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. సూర్య ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మూడు సన్నాహక మ్యాచ్‌ల్లోనూ దంచికొట్టాడు. ఇదే జోరును పాక్‌తో పోరులో కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. ఐదో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఆరో స్థానంలో అక్షర్ పటేల్ ఆడనున్నారు. హార్దిక్.. ఫినిషర్‌గా విలువైన పరుగులు చేయాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ ఎక్స్‌ట్రా బౌలర్‌గా బౌలర్లకు అండగా నిలవాల్సి ఉంది. ఇక అక్షర్ పటేల్.. జడేజా లేని లోటును పూడ్చాల్సి ఉంది.

పంత్ ఔట్.. కార్తీక్ ఇన్..
వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్నాడు. మరోవైపు ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్ సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే కార్తీక్ ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా బాదగలడు. పైగా గత కొన్ని మ్యాచ్‌ల్లో ఫినిషర్‌గా అదరగొట్టాడు. డెత్ ఓవర్లలో తనదైన బ్యాటింగ్‌తో బౌలర్లను చెడుగుడు ఆడాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చాహల్, అశ్విన్‌లలో ఒకరు బరిలోకి దిగనున్నారు. ప్రత్యర్థి టీమ్ కాంబినేషన్, పిచ్ కండిషన్స్ ఆధారంగా ఈ ఇద్దరి విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

హర్షల్ పటేల్ డౌట్..
బ్యాటింగ్ డెప్త్ కావాలన్నా.. ప్రత్యర్థి జట్టులో లెఫ్టాండర్స్ ఎక్కువగా ఉన్నా అశ్విన్‌ను బరిలోకి దించనున్నారు. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌లు తుది జట్టులో అవకాశం దక్కించుకోనున్నారు. పిచ్ కండిషన్స్ ఆధారంగా హర్షల్ పటేల్‌కు అవకాశం దక్కనుంది. నెమ్మదైన పిచ్‌లు ఉన్నప్పుడు హర్షల్ పటేల్‌ను జట్టులోకి తీసుకోనున్నారు. పాక్‌తో పోరుకు అతను బెంచ్‌కే పరమితమయ్యే అవకాశాలున్నాయి.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్/యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్/హర్షల్ పటేల్


Click it and Unblock the Notifications












