
శుభమన్ గిల్ డౌటే..
రెండో టీ20 అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. చివరి మ్యాచ్ తుది జట్టులో మార్పుల గురించి తనకు తెలియదన్నాడు. అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఉన్నా.. ఒకే ఒక మ్యాచ్ మిగిలుందని, అందర్నీ ఆడించడం కుదరదని చెప్పాడు. అయితే చివరి టీ20కి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. రెండో టీ20లో కొనసాగించిన జట్టునే దాదాపు మూడో మ్యాచ్‌లో కొనసాగించవచ్చు.
రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడిస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం విఫలమైంది. అయినా ఇంకొన్ని మ్యాచ్‌ల్లో పంత్‌ను ఓపెనర్‌గా ఆడించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ పర్వాలేదనిపించాడు. ఒకవేళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్‌కు ఉద్వాసన తప్పదు.

సంజూకు నిరాశే..
మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా ఆడనున్నారు. సూర్య సూపర్ సెంచరీతో భారత్‌కు అద్భుత విజయాన్నందుకుంది. అయ్యర్ మాత్రం హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. కాబట్టి అతనికి మరో అవకావం ఇవ్వనున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైన దీపక్ హుడా.. బౌలింగ్‌లో దుమ్మురేపాడు. కెప్టెన్ హార్దిక్ సైతం తనకు మరిన్ని బౌలింగ్ ఆప్షన్స్ కావాలన్నాడు. కాబట్టి దీపక్ హుడాను పక్కనపెట్టే సాహసం టీమ్‌మేనేజ్‌మెంట్ చేయదు. హార్దిక్ ఐదో స్ధానంలో ఆడనుండగా.. ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే సంజూ శాంసన్‌కు మరోసారి మొండి చెయ్యే ఎదురుకానుంది.

ఉమ్రాన్‌కు దక్కని చోటు..
భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ అతనికి అండగా ఉండనున్నారు. భువీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయగా.. అర్ష్‌దీప్ మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు. అయినా ఈ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఏకైక స్పిన్నర్‌గా చాహల్ చోటుకు డోకా లేదు. అయితే ఎన్నో అంచనాలున్న ఉమ్రాన్ మాలిక్‌కు మరోసారి నిరాశే ఎదురుకానుంది. ఉమ్రాన్‌తో పాటు హర్షల్ పటేల్ సైతం బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

భారత్ తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్/శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












