India Playing 11: సంజూ, ఉమ్రాన్, సిరాజ్‌లకు నిరాశే.. న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

మౌంట్ మాంగనీ: టీ20 ప్రపంచకప్ 2022 వైఫల్యం అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. ఆతిథ్య న్యూజిలాండ్‌తో పాటు భారత్.. మెగా టోర్నీ సెమీఫైనల్లోనే వెనుదిరగడంతో ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కాంస్య పోరుగా భావించగా.. వర్షం పుణ్యమా తొలి మ్యాచ్ బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ కాస్త.. రెండు మ్యాచ్‌లు సిరీస్‌గా మారింది. మౌంట్ మాంగనీ వేదికగా ఆదివారం జరగనున్న రెండో మ్యాచ్‌లో తలపడేందుకు ఇరు జట్లు సిద్దమయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్ష సూచన ఉండటం అభిమానులతో పాటు ఇరు జట్ల బోర్డులను కలవరపెడుతోంది. తొలి మ్యాచ్‌లా బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోతుందా? కొన్ని ఓవర్ల ఆటైనా సాధ్యమవుతుందా? అనే ఆందోళన మొదలైంది. అయితే ఈ మ్యాచ్ బరిలోకి దిగే భారత తుది జట్టుపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్‌గా రిషభ్ పంత్..
రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ బౌలర్లు షమీ, అశ్విన్ ఈ పర్యటనకు దూరంగా ఉండటంతో తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తు టీ20 ప్రపంచకప్‌కు ఇప్పుడే ప్రణాళికలు మొదలు పెట్టాలని, సరైన యువ ఆటగాళ్లను ఎంచుకోవాలని, టీమిండియా సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. రిషభ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలనే ప్రతిపాదనల నేపథ్యంలో అతని చేత ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయిస్తారా? అనేది చూడాలి.

సంజూకు నిరాశే..
ఒకవేళ పంత్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమవుతాడు. అప్పుడు దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్‌లలో ఒకరు మిడిలార్డర్‌లో అవకాశం దక్కించుకుంటారు. టీమ్‌మేనేజ్‌మెంట్‌కు పంత్‌ను ఓపెనర్‌గా ఆడించే ఆలోచన లేకుంటే మాత్రం శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇషాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. అదే జరిగితే దీపక్ హుడా, అయ్యర్, సంజూ శాంసన్‌లలో ఇద్దరూ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. పంత్ ఓపెనర్‌గా ఆడినా.. అయ్యర్, దీపక్ హుడాలకే ఎక్కువ అవకాశాలుంటాయి. ఎక్స్‌ట్రా బౌలర్ కావాలనుకుంటే దీపక్ హుడా, బ్యాటర్ తీసుకోవాలనుకుంటే అయ్యర్ జట్టులోకి వస్తారు. పంత్ రూపంలో వికెట్ కీపర్ ఉండటంతో సంజూ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

ఉమ్రాన్, సిరాజ్‌లకు నో చాన్స్..
నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనుండగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఫినిషర్ రోల్ పోషిస్తాడు. ఓపెనర్‌గా ఆడించకుంటే ఐదో స్థానంలో పంత్ ఆడుతాడు. ఏడో స్థానంలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా.. ఎనిమిదో స్థానంలో హర్షల్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. హర్షల్ పటేల్ వద్దనుకుంటే అతని స్థానంలో సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లలో ఒకరిని తీసుకోవచ్చు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ నడిపించడనుండగా..అర్ష్‌దీప్ సింగ్ అతనికి అసిస్టెంట్ వ్యవహరించనున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయం.

భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్/సంజూ శాంసన్/దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్/ మహమ్మద్ సిరాజ్/ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications