Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI vs NZ: ఉమ్రాన్ మాలిక్ ఇన్.. సంజూ శాంసన్ డౌట్.. న్యూజిలాండ్‌తో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే!

India Playing XI vs New Zealand: Umran Malik IN and Sanju Samson Doubt

ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ కైవసం చేసుకొని జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర సమరానికి సిద్దమైంది. టీ20 ఫార్మాట్‌లో ఆడిన కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సగం మంది ఆటగాళ్లు స్వదేశం తిరుగు పయనమవ్వగా.. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లతో శిఖర్ ధావన్ టీమిండియాను నడిపించనున్నాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో గబ్బర్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 సిరీస్ మాదిరే తొలి మ్యాచ్ గెలిచి.. కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని టీమిండియా భావిస్తోంది. అయితే సీనియర్లు రోహిత్, కోహ్లీ గైర్హాజరీలో కుర్రాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం. అయితే తుది జట్టులోకి ఎవర్నీ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

సంజూ శాంసన్‌కు చోటు దక్కెనా..?

సంజూ శాంసన్‌కు చోటు దక్కెనా..?

టీ20 సిరీస్‌లో అవకాశం దక్కని సంజూ శాంసన్‌కు కనీసం వన్డే సిరీస్‌లోనైనా అవకాశం దక్కుతుందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అతనికి ఆల్‌రౌండర్ దీపక్ హుడాతో పోటీ నెలకొంది. ఓపెనర్లుగా కెప్టెన్ శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఆడటం ఖాయం కాగా.. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో వరుసగా విఫలమైన శ్రేయస్ అయ్యర్‌ను పక్కనపెట్టాలని భావిస్తే మాత్రం సంజూ శాంసన్‌ చోటుకు డోకా లేదు. కానీ అయ్యర్‌కు మరో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

వైస్ కెప్టెన్సీ హోదాలో..

వైస్ కెప్టెన్సీ హోదాలో..

పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న రిషభ్ పంత్‌.. వైస్ కెప్టెన్సీ హోదాలో జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. టీ20ల్లో దారుణంగా విఫలమైన అతనికి ఈ సిరీస్ చాలా కీలకం. ఇక్కడ విఫలమైతే.. జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆరో స్థానంలో సంజూ శాంసన్, దీపక్ హుడాలో ఒకరిని తీసుకోనున్నారు. ఆల్‌రౌండర్ కావాలని భావిస్తే దీపక్ హుడా జట్టులోకి వస్తాడు. టీ20ల్లో అతను సత్తా చాటాడు. దీపక్ హుడా జట్టులో ఉంటే టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యత ఇస్తుందనే విషయం టీ20 సిరీస్‌తో స్పష్టమైంది.

ఉమ్రాన్ మాలిక్ ఆడేనా..?

ఉమ్రాన్ మాలిక్ ఆడేనా..?

పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడటం ఖాయం కాగా.. అర్ష్‌దీప్ సింగ్ మరో పేస్ బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇక మూడో పేసర్ ఆప్షన్స్‌లో ఉమ్రాన్ మాలిక్‌కు సీనియర్ దీపక్ చాహర్‌తో పోటీ నెలకొంది. ప్రపంచకప్ ముందు గాయంతో జట్టు దూరమైన దీపక్ చాహర్ మళ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం దీపక్ చాహర్‌కు ఉండటం అదనపు బలం.

చాలా రోజుల తర్వాత కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ కుల్చా జోడీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్‌లను పరిగణలోకి తీసుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తుది జట్టు(అంచనా)

శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్/దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్ /దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Thursday, November 24, 2022, 8:16 [IST]
Other articles published on Nov 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+