Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND Playing XI vs NZ: కుల్దీప్ ఇన్.. సర్ఫరాజ్ ఖాన్‌కు నో ఛాన్స్! న్యూజిలాండ్‌తో తలపడే భారత జట్టు ఇదే!

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌కు సిద్దమైంది. అక్టోబర్ 16 నుంచి బెంగళూరు వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

బంగ్లాదేశ్‌తో సిరీస్ గెలిచిన జట్టునే కొనసాగించింది. యువ పేసర్ యశ్ దయాల్ గాయపడటంతో అతన్ని జట్టు నుంచి తప్పించింది. ఈ ఒక్కటి మినహా ఎలాంటి మార్పు చేయలేదు. రెండో టెస్ట్ ముంగిట ఇరానీ కప్ కోసం విడుదలైన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తిరిగి జట్టుకు ఎంపికయ్యారు.

India Playing XI vs New Zealand Test Series Kuldeep Yadav In No Axar Patel Or Sarfaraz Khan

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో వైస్ కెప్టెన్‌ను నియమించలేదు. వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తాడని భావించినా.. ఎంపిక చేయలేదు. చీలమండ గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉంటున్న షమీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. కేవలం ముగ్గురు పేసర్లతోనే టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్‌తో నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన భారత్.. యశ్ దయాల్‌కు రిప్లేస్‌మెంట్ తీసుకోలేదు.

ఈ లెక్క ప్రకారం భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేస్ బౌలింగ్ ప్రధాన ఆయుధంగా ఉన్న కివీస్‌ను స్పిన్నర్లతో దెబ్బతీయాలనే వ్యూహంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. అక్షర్ పటేల్‌కు మరోసారి నిరాశే ఎదురు కానుంది.

కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ నెలకొననుంది. అయితే కేఎల్ రాహుల్‌కే ప్రాధాన్యత దక్కనుంది. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్.. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు. ఆకాశ్ దీప్‌కు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

Story first published: Saturday, October 12, 2024, 11:31 [IST]
Other articles published on Oct 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+