Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: అశ్విన్ ఇన్.. సూర్య ఔట్! సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs NEW Zealand for Semi final: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించిన రోహిత్ సేన.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది.

తద్వారా గత ప్రపంచకప్‌లో ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. లీగ్ దశలో ఇప్పటికే కివీస్‌ను మట్టికరిపించిన రోహిత్ సేన.. రెట్టించిన ఉత్సాహంతో సెమీస్ బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్‌ను ఓడించి.. అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని కివీస్ భావిస్తోంది. ఏది ఏమైనా ఈ సెమీస్ పోరు అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుంది.

India Playing XI vs New Zealand for Semi final: Ravi Ashwin In and Suryakumar Yadav Out

ఇప్పటికే ఇరు జట్లు ముంబై చేరుకున్నాయి. ఈ కీలకపోరులోనూ టీమిండియా కాంబినేషన్‌లోపెద్దగా మార్పులు చేసుకునే అవకాశం లేదు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చకుండా అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్ననేపథ్యంలో వారికి చెక్‌పెట్టేందుకు టీమిండియా వ్యూహాత్మక మార్పు చేయవచ్చు.

ఎక్స్‌ట్రా బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను బరిలోకి దించవచ్చు. ఈ ఒక్క విషయంలో తప్పా టీమ్‌కాంబినేషన్‌లో మార్పు చేయాల్సిన అవసరం టీమిండియాకు లేదు. అశ్విన్ జట్టులోకి వస్తే టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ కూడా లభించనుంది. కానీ బ్యాటింగ్ విభాగం బలహీనం కానుంది.

అశ్విన్‌కు బ్యాటింగ్ చేసే సామార్థ్యం ఉన్నా.. సూర్యకుమార్ స్థాయిలో రాణించలేడు. కివీస్‌తో లీగ్ దశలో జరిగిన పోరులో టీమిండియా అశ్విన్ లేకుండానే ఆడింది. కానీ అప్పుడు హార్దిక్ పాండ్యా రూపంలో టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉంది. చీలమండ గాయంతో అతను దూరం కావడంతో జట్టులోకి షమీ వచ్చాడు. అతను నిప్పులు చెరగడంతో టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ అవసరమవ్వలేదు.

రోహిత్, గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్‌లతో టీమిండియా టాపార్డర్ భీకరంగా ఉంది. బుమ్రా, షమీ, సిరాజ్‌లతో పేస్ విభాగం పటిష్టంగా ఉండగా.. జడేజా, కుల్దీప్ స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు. లీగ్ దశ తరహాలోనే సమష్టిగా రాణిస్తే సెమీస్‌లోనూ టీమిండియాకు తిరుగుండదు.

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో బరిలోకి దిగే భారత తుది జట్టు(అంచనా):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్/రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

Story first published: Monday, November 13, 2023, 22:47 [IST]
Other articles published on Nov 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+