IND vs NZ: అతనికి మళ్లీ నిరాశే.. న్యూజిలాండ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుస విజయాలతో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే గ్రూప్-ఏ టాపర్‌గా నిలవనుండటంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే వరుస విజయాలతో భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. బలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉండటంతో పాటు వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్నాయి. దాంతో ఈ పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
అయితే దుబాయ్ వేదికగానే ఈ మ్యాచ్ జరగుతుండటం టీమిండియాకు కలిసిరానుంది. ఇప్పటికే ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచిన భారత్‌కు దుబాయ్ పరిస్థితులు బాగా అలవాటయ్యాయి. మరోవైపు పాకిస్థాన్‌లో ఆడి వస్తున్న న్యూజిలాండ్‌కు దుబాయ్ పిచ్ కండిషన్స్‌లో ఆడటం సవాల్‌గా మారనుంది. కాకపోతే ఆ జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు ఉండటంతో పాటు స్లో వికెట్‌పై బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న బ్యాటర్లు ఉన్నారు. అంతేకాకుండా మెగా టోర్నీల్లో భారత్‌పై న్యూజిలాండ్‌దే పై చేయి.

రిషభ్ పంత్‌కు నిరాశే..
ఈ మ్యాచ్‌కు టీమిండియా దాదాపు విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దాంతో తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడినప్పటికీ.. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. దాంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అతనే జట్టును నడిపించనున్నాడు. దాంతో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. రోహిత్ దూరమైతే అతని స్థానంలో రిషభ్ పంత్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో చురుకగా పాల్గొనడంతో పాటు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు టీమ్ వర్గాలు పేర్కొన్నాయి.
దాంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. ఫస్ట్ డౌన్‌లో కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ బాది ఫామ్ అందుకున్నాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనుండగా.. ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా ఆడనున్నాడు. స్పిన్ విభాగంలో మార్పులు చేసే అవకాశం లేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగనున్నారు. దాంతో వరుణ్ చక్రవర్తీ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
మహమ్మద్ షమీ ఔట్..
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొన్నాడు. తన చీల మండ గాయం తిరగబెట్టినట్లు కనిపించింది. దాంతోనే అతను పాక్‌తో మ్యాచ్‌లో సమర్థవంతంగా బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. దాంతో మహమ్మద్ షమీ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. హర్షిత్ రాణాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా భారత జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
న్యూజిలాండ్‌తో భారత తుది జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications