For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: అతనికి మళ్లీ నిరాశే.. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు కనబర్చిన టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో టీమిండియా బలహీనతలు బయటపడ్డాయి. ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 తిరువనంతపురం వేదికగా శనివారం జరగనుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి మ్యాచ్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్‌ తన హోమ్ టౌన్‌లో చెలరేగి ఫామ్ అందుకుంటాడా? లేక వైఫల్యాన్ని కొనసాగిస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

శ్రేయస్ అయ్యర్‌కు నిరాశే..

ఆఖరి టీ20లోనూ శ్రేయస్ అయ్యర్‌కు నిరాశే ఎదురు కానుంది. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగంగా ఉన్న ఆటగాళ్లందర్నీ ఆడించాలనే ఉద్దేశంతోనే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే అయ్యర్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. నాలుగో టీ20కి దూరమైన ఇషాన్ కిషన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

India Playing XI vs New Zealand For 5th T20I No Shreyas Iyer Ishan Kishan Returns

వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా‌కు వర్క్‌లోడ్‌మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతి ఇవ్వవచ్చు. ఒకవేళ అతన్ని కొనసాగించాలనుకుంటే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది. నాలుగో టీ20లో రాణా ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. మరోసారి ఎక్స్‌ట్రా బౌలర్‌తో ఆడాలనుకుంటే మాత్రం ముగ్గురు పేసర్లు బరిలోకి దిగుతారు.

కుల్దీప్ యాదవ్ ఔట్..

వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్‌కు ఆఖరి టీ20 నుంచి విశ్రాంతి కల్పించవచ్చు. అక్షర్ పటేల్ గాయంతో దూరమవడంతో జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడాడు. గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న వరుణ్ చక్రవర్తీ.. కుల్దీప్ యాదవ్ స్థానంలో బరిలోకి దిగుతాడు. రవి బిష్ణోయ్‌ను తప్పించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగుతాడు. ఆఖరి మ్యాచ్‌కు కూడా అక్షర్ పటేల్ దూరం కానున్నాడు.

సంజూకు లాస్ట్ ఛాన్స్..?

వరుసగా నాలుగు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌కు తన హోమ్ గ్రౌండ్‌లో ఆఖరి అవకాశం ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌లో రాణించకపోతే సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. మిగతా బ్యాటింగ్ కాంబినేషన్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. సంజూకు జతగా అభిషేక్ శర్మ ఆడనుండగా.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే మిడిలార్డర్‌లో ఆడనున్నారు. హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది.

న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే:

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, హర్షిత్ రాణా/జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.

Story first published: Thursday, January 29, 2026, 13:32 [IST]
Other articles published on Jan 29, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+