India Playing XI: ఆటలో అరటి పండు సంజూ శాంసనే.. న్యూజిలాండ్‌తో మూడో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు వరణుడు ఊహించని షాకిచ్చాడు. రెండో వన్డే జరగకుండా అడ్డుకోవడంతో మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దు అయ్యింది. దాంతో సిరీస్‌లో నిలవాలంటే బుధవారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగే మూడో వన్డేలో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ఈ మ్యాచ్‌లో ఓడినా.. టై అయినా.. వర్షంతో తుడిచిపెట్టుకుపోయినా సిరీస్ కివీస్ వశం అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు తొలి వన్డే విజయంతో దూకుడు మీదున్న న్యూజిలాండ్ అదే జోరులో విజయాన్నందుకొని సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది.

సంజూనే ఆటలో అరటిపండు..!
స్టార్ ప్లేయర్ సంజూ శాంసనే మరోసారి ఆటలో అరటి పండయ్యే అవకాశం ఉంది. టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అందుకోని సంజూ.. తొలి వన్డే ఆడాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోగా..ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీపక్ హుడాను ఎందుకు ఆడించలేదని మాజీ క్రికెటర్లు ప్రశ్నించారు.
దాంతో రెండో వన్డేకు దీపక్ హుడాను తీసుకున్న శిఖర్ ధావన్.. సంజూ శాంసన్‌ను పక్కనపెట్టాడు. ఈ పర్యటనలో ఒకే ఒక అవకాశం అందుకొని పర్వాలేదనిపించిన సంజూను పక్కనపెట్టడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్‌కు అండగా ఉంటూ.. సంజూకు అన్యాయం చేస్తోంది. చివరి వన్డేలో కూడా సంజూకు అవకాశాలు దక్కేలా లేవు.

రక్షణగా వైస్ కెప్టెన్సీ..
రెండో వన్డే పూర్తిగా జరిగి.. పంత్, సూర్య, శ్రేయస్‌లలో ఎవరైనా విఫలమైనా.. భారత్ విజయం సాధించినా సంజూ శాంసన్‌కు లైన్ క్లియర్ అయ్యేది. కానీ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంతో రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించే అవకాశాలున్నాయి. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ ఆడటం ఖాయం. ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. తొలి వన్డేలో విఫలమైన సూర్య.. రెండో వన్డేలో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఈ పర్యటనలో అత్యంత దారుణంగా విఫలమైంది పంత్ ఒక్కడే. కానీ వైస్ కెప్టెన్సీ హోదాతో అతను బతికిపోతున్నాడు.

కుల్దీప్ యాదవ్‌కు నిరాశే..
ఆరో స్థానంలో దీపక్ హుడా బరిలోకి దిగనున్నాడు. ఒకవేళ సంజూను ఆడించాలనుకుంటే మాత్రం పంత్, సూర్య, శ్రేయస్ అయ్యర్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ చోటుకు డోకా లేదు. తొలి వన్డేలో బౌలింగ్‌లో విఫలమైనా.. బ్యాటింగ్‌లో అతను సత్తా చాటాడు. తొలి వన్డేలో విఫలమైన శార్దూల్ ఠాకూర్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ రెండో వన్డేలో దీపక్ చాహర్‌కు అవకాశం ఇచ్చింది. అయితే మూడో వన్డేలో కూడా అతన్నే కొనసాగించే అవకాశం ఉంది. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ స్థానాలకు డోకా లేదు. దాంతో కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశనే మిగలనుంది.

తుది జట్టు(అంచనా)
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications