న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: చాహల్ ఔట్.. సంజూ శాంసన్ డౌట్! న్యూజిలాండ్‌తో రెండో వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs New Zealand for 2nd ODI: Yuzvendra chahal Out and Sanju Samson Doubt

హమిల్టన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం హమిల్టన్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో 7 వికెట్లతో ఓటమిపాలైంది. దాంతో సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడితే మరో మ్యాచ్ మిగిలుండగానే గబ్బర్ సేన సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు విజయంతో దూకుడు మీదున్న న్యూజిలాండ్ అదే జోరులో విజయాన్నందుకొని సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటుంది.

సంజూ శాంసన్‌ ఔట్..

సంజూ శాంసన్‌ ఔట్..

307 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయిన టీమిండియా బౌలింగ్‌‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్లాండ్ వంటి చిన్నమైదానంలో ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. కచ్చితంగా సిక్స్ బౌలింగ్ ఆప్షన్స్‌తో బరిలోకి దిగాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో వన్డేలో టీమిండియా మార్పులతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలంటే ఓ బ్యాటర్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి. దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంటే శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాలి.

సూర్యను తప్పిస్తారా..?

సూర్యను తప్పిస్తారా..?

తొలి వన్డేలో శ్రేయస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. సెంచరీ చేరువగా వచ్చి ఔటయ్యాడు. అంతేకాకుండా వన్డే క్రికెట్‌లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతన్ని పక్కనపెట్టే అవకాశం లేదు. సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా.. సూపర్ ఫామ్‌లో ఉన్న అతన్ని పక్కనపెట్టే సాహసం టీమ్‌మేనేజ్‌మెంట్ చేయలేదు. తొలి వన్డేలో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడకపోయినా.. అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ దీపక్ హుడా కోసం అతన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి టీమ్‌మేనేజ్‌మెంట్ ఉంది. ఓపెనర్లుగా రాణించిన శుభ్‌మన్ గిల్, శిఖర్ ధావన్‌ స్థానాలకు కూడా డోకా లేదు.

వైస్ కెప్టెన్సీ కాపాడుతుందా?

వైస్ కెప్టెన్సీ కాపాడుతుందా?

నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న రిషభ్ పంత్.. వైస్ కెప్టెన్సీ హోదాలో జట్టులో కొనసాగుతున్నాడు. అయితే టీ20 సిరీస్‌తో పాటు తొలి వన్డేలో పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని తప్పించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. దీపక్ హుడా కోసం పంత్‌ను తప్పించే సాహసం టీమ్‌మేనేజ్‌మెంట్ చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ పంత్‌ను తప్పిస్తే సంజూ శాంసన్ జట్టులో కొనసాగుతాడు. ఆరో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ చోటుకు డోకా లేదు. బౌలింగ్‌లో విఫలమైనా.. బ్యాటింగ్‌లో అతను సత్తా చాటాడు.

చాహల్ ఔట్.. చాహర్ ఇన్..

చాహల్ ఔట్.. చాహర్ ఇన్..

న్యూజిలాండ్‌లో మైదానాలన్నీ చిన్న మైదానాలు కావడంతో రిస్ట్ స్పిన్నర్లు తేలిపోతున్నారు. తొలి వన్డేలో చాహల్ ఒక్క వికెట్ తీయకపోగా.. దారుణంగా పరుగులిచ్చుకున్నాడు. హామిల్టన్ మైదానం కూడా చిన్నదే కావడంతో చాహల్‌ను పక్కనపెట్టి దీపక్ చాహర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అలా చేయడం వల్ల టీమిండియా బ్యాటింగ్ డెప్త్ కూడా పెరగనుంది. పేసర్లుగా ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ ఆడటం ఖాయం. ఒకవేళ చాహల్‌ను కొనసాగించాలనుకుంటే శార్దూల్‌ను పక్కనపెట్టి చాహర్‌తో బరిలోకి దిగవచ్చు. కుల్దీప్‌ యాదవ్‌కు మాత్రం మరోసారి నిరాశ తప్పేలా లేదు.

తుది జట్టు(అంచనా)

శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సంజూ శాంసన్/దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Saturday, November 26, 2022, 10:57 [IST]
Other articles published on Nov 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X