For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: బుమ్రా, హార్దిక్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌‌లో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. అప్‌కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు న్యూజిలాండ్‌తో ప్రీ ఫైనల్ టీ20 సిరీస్‌ ఆడేందుకు టీమిండియా సన్నదమైంది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేవనుంది.

అనుభవం లేని ద్వితీయ శ్రేణి జట్టుతో వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. అదే జోరులో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. తద్వారా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగాలని భావిస్తోంది. మరోవైపు వన్డే‌ సిరీస్‌కు భిన్నమైన సెటప్‌తో టీమిండియా టీ20 సిరీస్‌లో బరిలోకి దిగుతోంది.

గత కొన్నేళ్లుగా టీ20ల్లో టీమిండియాకు తిరుగులేదు. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఏదైనా భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచకప్ ముందు ప్రీ ఫైనల్‌గా జరుగుతున్న ఈ సిరీస్‌లోనూ దుమ్మురేపి న్యూజిలాండ్‌ను మట్టికరిపించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది.

India Playing XI vs New Zealand Bumrah Varun Chakravarthy In Kuldeep Yadav Doubtful for 1st T20I

బుమ్రా, వరుణ్ చక్రవర్తీ రీఎంట్రీ..

టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఐదు టీ20ల సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మెగా టోర్నీ నేపథ్యంలోనే అతనితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు టీమ్‌మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ ఇద్దరికి తోడుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ భారత జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. ఈ ముగ్గురి రాకతో బలహీనంగా ఉన్న భారత బౌలింగ్ ప్రమాదకరంగా మారనుంది.

స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమవ్వడం టీమిండియాకు ఎదురుదెబ్బే. సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్, తిలక్ వర్మ స్థానంలో అయ్యర్ భారత జట్టులోకి వచ్చారు. దాంతో టీమిండియా కాంబినేషన్‌ ఎలా ఉంటుందనే ఆసక్తిగా మారింది.

టీమిండియా కాంబినేషన్ ఏంటంటే..?

న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడనుండగా.. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ ఇద్దరూ రాణించడం టీమిండియాకు కీలకం.

ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనుండగా.. ఆరో స్థానంలో శివమ్ దూబే, ఏడో స్థానంలో అక్షర్ పటేల్‌ ఆడనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగనుండగా.. కుల్దీప్ యాదవ్‌కు నిరాశే ఎదురవ్వనుంది. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగాలనుకుంటేనే కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కుతుంది. అప్పుడు శివమ్ దూబే, హర్షిత్ రాణాల్లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/కుల్దీప్ యాదవ్/రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి,


న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్

Story first published: Monday, January 19, 2026, 11:30 [IST]
Other articles published on Jan 19, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+