India Playing XI: తెలుగోడికి ఛాన్స్.. నేపాల్‌తో బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!
హైదరాబాద్: ఆసియాకప్ 2023లో శుభారంభం చేయాలని భావించిన టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. దాయాదీ పాకిస్థాన్‌తో శనివారం జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో వరుణుడే విజయం సాధించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యమవ్వలేదు.
దాంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్ కేటాయించారు. దాంతో ప్రపంచకప్ ముందు బిగ్ మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఎదురు చూసిన భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకపోయినా ఓ పాయింట్ దక్కించుకున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది.

పసికూన నేపాల్‌తో సోమవారం ఇదే పల్లెకెలె మైదానం వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది. దురదృష్టం ఏంటంటే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దయినా భారత్‌కు వచ్చే నష్టం లేదు. పసికూన సంచలన ఫలితం సాధిస్తే మాత్రం భారత్ ఇంటిదారి పడుతోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే లేదు.
ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకొని పసికూనపై ప్రయోగాలు చేయాలనుకుంటే మాత్రం మార్పులు జరగవచ్చు. లెఫ్టాండర్ అయిన తిలక్ వర్మను తుది జట్టులోకి తీసుకురావచ్చు. శార్దూల్ ఠాకూర్‌కు బదులుగా మహమ్మద్ షమీని ఆడించవచ్చు. సూర్యకుమార్ యాదవ్‌ను కూడా లోయరార్డర్‌లో పరీక్షించవచ్చు.
రాహుల్ ద్రవిడ్ మార్పులకు ఆసక్తికనబర్చినా.. రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగేందుకు మొగ్గు చూపవచ్చు. ప్రత్యర్థి పసికూన అని భావిస్తేనే ఈ ప్రయోగాలకు ఒకే చెప్పే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో క్లిష్ట పరిస్థితుల్లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అసాధారణ ఇన్నింగ్స్ ఆడారు.

మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌పై ఉన్న సందేహాలన్నీ ఈ ఇన్నింగ్స్‌తో తీరాయి. తీవ్ర ఒత్తిడిలో అతను అసాధారణంగా బ్యాటింగ్ చేశాడు. టీమిండియా టాపార్డర్ మాత్రం దారుణంగా విఫలమైంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది. పసికూన నేపాల్‌పై చెలరేగి రిథమ్‌లోకి వచ్చేందుకు ఈ నలుగురు ప్రయత్నించవచ్చు.
బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో షమీని తీసుకురావచ్చు. బ్యాటింగ్ చేస్తాడని శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోగా.. అతను తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగడం ఖాయం. అతనికి తోడుగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications