Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: బుమ్రా రీఎంట్రీ.. రింకూ సింగ్ అరంగేట్రం! ఐర్లాండ్‌తో ఆడే భారత తుది జట్టు ఇదే!

హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ముగించిన టీమిండియా మరో ఆసక్తికర సిరీస్‌కు సిద్దమైంది. ఐర్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో టీమిండియా తృతీయ శ్రేణి జట్టు బరిలోకి దిగనుంది. ఆసియాకప్ 2023 నేపథ్యంలో ఈ పర్యటనకు సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు విశ్రాంతి కల్పించారు.

వెన్ను గాయంతో గతేడాది కాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ పర్యటనలో జట్టును అతనే నడిపించనున్నాడు. బుమ్రాతో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బుమ్రాను ఈ సిరీస్ ఆడిస్తున్నారు.

Jasprit Bumrah returns, Rinku Singh likely to debut

మరో రెండు రోజుల్లోనే బుమ్రా సారథ్యంలోని టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్ పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ ఈ సిరీస్‌కు కూడా ఎంపికయ్యారు. ఈ ఇద్దరితో పాటు సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ అవకాశం అందుకున్నారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో సత్తా చాటిన రింకూ సింగ్.. ఈ పర్యటన నేపథ్యంలో తొలిసారి టీమిండియా పిలుపును అందుకోగా.. చాలా రోజుల తర్వాత శివమ్ దూబే భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కుర్రాళ్లతో కూడిన ఈ టీమ్‌ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ పర్యటన నుంచి రాహుల్ ద్రవిడ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు విశ్రాంతి కల్పించడంతో సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే కోచ్‌‌లుగా వ్యవహరించనున్నారు.

శుక్రవారం జరిగే తొలి టీ20లో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐర్లాండ్ పిచ్‌లు పేస్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగవచ్చు. అయితే శివవ్ దూబే రూపంలో ఓ పేస్ ఆల్‌రౌండర్ ఉండటంతో స్పిన్ ఆల్‌రౌండర్‌తో ఆడనున్నారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఆడనుండగా.. ఫస్ట్ డౌన్‌లో సంజూ శాంసన్, నాలుగో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ చేయనున్నారు.

శివమ్ దూబే ఐదో స్థానంలో ఆడనుండగా.. రింకూ సింగ్ ఆరో స్థానంలో ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ ఆడనున్నారు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ ఆడే అవకాశం ఉంది. ప్రసిధ్ కృష్ణకు ముకేశ్ కుమార్‌తో పోటీ ఉండనుంది.

భారత తుది జట్టు (అంచనా)

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్‌దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్/ ప్రసిధ్ కృష్ణ

Story first published: Monday, August 14, 2023, 18:01 [IST]
Other articles published on Aug 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+