Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing 11: పంత్ ఇన్.. కార్తీక్ ఔట్.. చాహల్ డౌట్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో తలపడే భారత జట్టు ఇదే!

 India Playing XI vs England: Yuzvendra Chahal and Rishabh Pant set to play semifinal

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో అంచనాలకు తగ్గట్లు రాణించిన టీమిండియా.. ఊహించినట్లుగానే సెమీస్‌కు దూసుకెళ్లింది. జింబాబ్వేతో జరిగిన ఆఖరి పోరులో 71 పరుగులతో విజయం సాధించిన భారత్.. సూపర్ 12‌ను దిగ్విజయంగా ముగించింది. గ్రూప్-2 టాపర్‌గా గ్రూప్-1 రన్నరప్ అయిన ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు సిద్దమైంది. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో ఉన్న రోహిత్ సేన.. వాటిని కూడా ధాటి విశ్వవిజేతగా నిలవాలని భావిస్తోంది. 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఐసీసీ టైటిల్ కరువు తీర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం రోహిత్ సేనకు బిగ్ టాస్క్‌గా మారింది. ఇరు జట్లు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అయితే కీలక సెమీస్ పోరులో టీమిండియా ఎంచుకునే కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పంత్‌కు మరో చాన్స్..

పంత్‌కు మరో చాన్స్..

ఈ మెగా టోర్నీలో టీమిండియా ఒకటి, రెండు మార్పులు మినహా పెద్దగా జట్టును మార్చలేదు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్న టీమ్‌మేనేజ్‌మెంట్.. జింబాబ్వేతో కార్తీక్ స్థానంలో పంత్‌కు అవకాశం ఇచ్చింది. ఈ రెండు మార్పులు మినహా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. మార్పులు చేయాల్సిన అవసరం కూడా జట్టుకు రాలేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించింది. జింబాబ్వేతో పోరులో అవకాశాన్ని అందుకున్న పంత్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారీ షాట్ ఆడబోయి.. ప్రత్యర్థి సూపర్ ఫీల్డింగ్‌కు వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే పంత్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అతనికి రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు.

కార్తీక్‌కు అవకాశం ఇచ్చినా..

కార్తీక్‌కు అవకాశం ఇచ్చినా..

పంత్ వైఫల్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అసలు జింబాబ్వేతో పోరును సన్నాహకంగా భావించామని పేర్కొన్నాడు. అతని వ్యాఖ్యలతో పంత్‌కు మరో అవకాశం దక్కనుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదని భావిస్తే మాత్రం దినేశ్ కార్తీక్ జట్టులో వస్తాడు. వాస్తవానికి పంత్ కంటే కార్తీక్‌కే టీమ్‌మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇచ్చింది. వరుసగా విఫలమవుతున్నా అండగా నిలిచింది. కానీ అతను ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే పంత్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. పైగా అతని రాకతో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కలిసిరానుంది. ఈ క్రమంలోనే పంత్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 చాహల్‌కు చాన్స్..

చాహల్‌కు చాన్స్..

టీమ్ కాంబినేషన్‌ గురించి రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌‌కు అనుకూలంగా ఉన్నాయి. 'అడిలైడ్‌లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని పాకిస్థాన్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌తో అర్థమైంది. తాజాగా నేను కూడా పిచ్‌ను పరిశీలించా. నెమ్మదిగా ఉండి బంతి టర్న్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు ఇక్కడే బంగ్లాదేశ్‌తో ఆడిన పిచ్‌ స్పిన్నర్లకు పెద్దగా సహకరించలేదు. అయితే కొత్త పిచ్‌ మాత్రం టర్నింగ్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. మ్యాచ్‌ సమయానికి పిచ్‌కు తగ్గట్లుగా తుది జట్టును ఎంచుకొంటాం'అని రాహుల్ ద్రవిడ్‌ వెల్లడించాడు. ఈ క్రమంలోనే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన చాహల్‌కు తుది జట్టులో అవకాశం దక్కనుంది.

 బ్యాటింగ్, బౌలింగ్‌లో మార్పుల్లేవ్..

బ్యాటింగ్, బౌలింగ్‌లో మార్పుల్లేవ్..

ఇక బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు లేవు. రోహిత్ శర్మ, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా శుభారంభం ఇవ్వలేకపోయారు. కనీసం సెమీఫైనల్‌లో అయినా మంచి స్టార్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సూర్య, కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండగా.. హార్దిక్ బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. బౌలింగ్‌లో భువీ, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ దుమ్మురేపుతున్నారు. అశ్విన్ సైతం రఫ్ఫాడించాల్సి ఉంది.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్/దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/అక్షర్ పటేల్

Story first published: Tuesday, November 8, 2022, 13:45 [IST]
Other articles published on Nov 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+