Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: మరో యువ ప్లేయర్ అరంగేట్రం.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే!

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి పోరుకు సిద్దమైంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న ఈ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఇదే జోరులో ఆఖరి మ్యాచ్‌ను కూడా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్స్ టేబుల్‌లో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటోంది. మరోవైపు ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి గెలుపుతో భారత పర్యటనను ముగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. దాంతో ఆఖరి మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగనుంది.

India Playing XI vs England for 5th Test: Devdutt Padikkal likely to debut in Dharamsala

చివరి మ్యాచ్‌కు కూడా కేఎల్ రాహుల్ అందుబాటులోకి రాకపోవడం.. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు తీరిక లేని క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తే.. వైస్ కెప్టెన్ హోదాలో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు.

రోహిత్ శర్మ స్థానంలో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయనున్నాడు. అప్పుడు రజత్ పటీదార్ కూడా తుది జట్టులో కొనసాగనున్నాడు. రోహిత్ శర్మ బరిలోకి దిగితే మాత్రం రజత్ పటీదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మిగతా బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు.

ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ సైతం తుది జట్టులో కొనసాగనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా జడేజా, అశ్విన్ ఆడనుండగా.. భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ధర్మశాల పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో సిరాజ్, ఆకాశ్ దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అయితే ఆకాశ్ దీప్‌కు ముకేశ్ కుమార్ నుంచి పోటీ ఎదురుకానుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడిస్తే కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు. రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తే అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కుతుంది.

భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్/ముఖేశ్ కుమార్

టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , కేఎస్ భరత్ , దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

Story first published: Friday, March 1, 2024, 20:34 [IST]
Other articles published on Mar 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+