Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: సూర్య ఔట్ .. షమీ డౌట్! ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టు ఇదే!

India Playing XI vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం(అక్టోబర్ 29) లక్నో వేదికగా జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది.

మరోవైపు ఘోర పరాజయాలతో చతికిలపడిన ఇంగ్లండ్‌కు సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ గెలవడం ముఖ్యం. ఈ క్రమంలోనే టీమిండియాను ఓడించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని ఆ జట్టు భావిస్తోంది.

 India Playing XI vs England, CWC 2023: Hardik Pandya IN and Suryakumar Yadav Out

దాంతో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా చీలమండకు గాయమైంది. దాంతో అతను ఎన్‌సీఏకు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ బరిలోకి దిగారు.

పాండ్యా గైర్హాజరీలో టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్‌‌తో పాటు బ్యాటింగ్ డెప్త్ లేకుండా పోయింది. షమీ కోసం శార్దూల్ ఠాకూర్‌ను తప్పించాల్సి వచ్చింది. మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తా చాటినా.. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం రోహిత్‌కు ఇబ్బంది అయ్యింది. హార్దిక్ రీఎంట్రీ ఇవ్వనుండటంతో సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడనుంది.

 India Playing XI vs England, CWC 2023: Hardik Pandya IN and Suryakumar Yadav Out

ఐదు వికెట్లతో సత్తా చాటిన షమీని పక్కనపెట్టడం రోహిత్‌కు సమస్యగా మారింది. లక్నో పిచ్ నెమ్మదిగా ఉండనున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో ఆడుతుందా? లేక పేసర్‌తో బరిలోకి దిగుతుందా? అనేది చూడాలి. పిచ్ కండిషన్స్‌పై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్ అవసరమైతే అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు.

పేసర్‌తోనే ఆడాల్సి వస్తే మాత్రం షమీనే కొనసాగించనున్నారు. బ్యాటింగ్ డెప్త్ లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. హార్దిక్ కోలుకోకపోతే మాత్రం.. సూర్య‌నే కొనసాగనున్నాడు. మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు.

ఇంగ్లండ్‌తో టీమిండియా ఎలెవన్(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Story first published: Tuesday, October 24, 2023, 21:44 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+