Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI vs ENG 3rd T20: శ్రేయస్ ఇన్.. పంత్ డౌట్! మూడో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs ENG 3rd T20: Shreyas Iyer and Umran Malik Likely to play

బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌ గడ్డపై జోరు మీదున్న టీమిండియా.. 24 గంటల వ్యవధిలోనే మరో పోరుకు సిద్దమైంది. రెండో మ్యాచ్ జరిగిన బర్మింగ్‌హామ్ వేదికగానే నేడు(ఆదివారం) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న చివరి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 49 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకొని 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

చివరి మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఊహించని పరాజయాలతో రగిలిపోతున్న ఇంగ్లండ్.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్ కూడా ప్రేక్షకులకు కావాల్సిన మజానివ్వనుంది.

 జట్టులోకి బెంచ్ ఆటగాళ్లు..

జట్టులోకి బెంచ్ ఆటగాళ్లు..

అయితే రీషెడ్యూల్ టెస్ట్ ఆడిన ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా, బుమ్రా అందుబాటులోకి రావడంతో రెండో మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్, అర్ష్‌దీప్‌లను పక్కన బెట్టారు. ఇక నామమాత్రపు మూడో టీ20లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామని విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దాంతో చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టు కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

విన్నింగ్ కాంబినేషన్‌లో ఏయే ఆటగాళ్లను పక్కనపెడుతారు? ఎవరికి అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశమైంది. రెండో టీ20లో విఫలమైన కోహ్లీకి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇక బెంచ్‌పై ఉన్న శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్‌, అక్షర్ పటేల్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

రిషభ్ పంత్ డౌట్..

రిషభ్ పంత్ డౌట్..

రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రిషభ్ పంత్‌కు చివరి మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిస్తారా? లేక కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ పంత్‌ను కొనసాగిస్తే మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకోనున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన సూర్యకు రెస్ట్ ఇవ్వనున్నారు.

సూపర్ ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాను తీసుకోవాలనుకుంటే పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాను పోటీ లేదు. అయితే అతనికి రెస్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం అక్షర్ పటేల్‌ను ఆడించవచ్చు. రెండో టీ20లో మెరిసిన జడేజా ప్లేస్‌కు డోకా లేదు.

బుమ్రా సారథ్యంలో..

బుమ్రా సారథ్యంలో..

వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వారి స్థానంలో యువ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్‌లను జట్టులోకి తీసుకోవచ్చు. ఉమ్రాన్ ఐర్లాండ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని అతన్ని మేటి బౌలర్‌గా తీర్చిదిద్దాలనే యోచనలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఉంది. అదే జరిగితే బుమ్రా నేతృత్వంలో ఆవేశ్, ఉమ్రాన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన చాహల్‌కు కూడా రెస్ట్ ఇవ్వచ్చు. అతని స్థానంలో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ను ఆడించే అవకాశం ఉంది.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), రిషభ్ పంత్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, జడేజా/అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, జస్‌ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్

Story first published: Sunday, July 10, 2022, 10:05 [IST]
Other articles published on Jul 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+