For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI vs ENG 3rd ODI: ప్రసిధ్ కృష్ణ ఔట్.. శార్దూల్ ఇన్! మూడో వన్డే‌ ఆడే భారత తుది జట్టు ఇదే!

 India Playing XI vs ENG 3rd ODI: Shardul Thakur likely to replace Prasidh Krishna place

మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం అందుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఓటమిపాలైంది. దాంతో సిరీస్ 1-1తో సమమైంది. లార్డ్స్ వన్డేలో సునాయసంగా గెలవాల్సిన భారత్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మ్యాచ్ అయిన మూడో వన్డేకు సిద్దమైంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండో వన్డేలో అద్భుత విజయాన్నందుకున్న ఇంగ్లండ్.. అదే జోరును కొనసాగించి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్ మాత్రం రెండో వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకొని సిరీస్‌ను కైవసం చేసుకోవాలనుకుంటుంది.

ప్రసిధ్‌పై వేటు..?

ప్రసిధ్‌పై వేటు..?

అయితే ఈ డిసైడర్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. ఒకవేళ ఎవరినైనా తీసేయాలనుకుంటే మాత్రం రెండో వన్డేలో దారుణంగా విఫలమైన ప్రసిధ్ కృష్టపై వేటు పడే చాన్స్ ఉంది. మిగతా బౌలర్లంతా కట్టడిగా బౌలింగ్ చేసిన వేళ ప్రసిధ్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. దాంతోనే ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ఈ క్రమంలోనే అతని తీసేసి బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయితే ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా ఆటగాళ్లను పక్కనపెట్టే రకం రోహిత్ శర్మ కాదు. ఈ క్రమంలోనే ప్రసిధ్‌కు మరో అవకాశం ఇస్తారా? లేక పక్కనబెడతారా? అనేది చూడాలి.

ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ ధావన్..

ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ ధావన్..

తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రోహిత్, శిఖర్ ధావన్ జోడీనే రెండో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది. రోహిత్ డకౌటవ్వగా.. ధావన్ 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రోహిత్ శర్మ ఆకట్టుకోగా.. శిఖర్ ధావన్ అతనికి సహకారంగా ఆడాడు. కానీ రెండో వన్డేలో మాత్రం ఈ ఇద్దరు చేతులెత్తేయడంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పడింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక వారు కూడా వికెట్లు ఇచ్చుకున్నారు. సిరీస్ గెలవాలంటే.. బ్యాటింగ్‌లో రోహిత్, శిఖర్ ధావన్ మంచి ఆరంభం అందించడం చాలా ముఖ్యం.

విరాట్ కోహ్లీకి విషమ పరీక్ష..

విరాట్ కోహ్లీకి విషమ పరీక్ష..

ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్, టీ20ల్లో విఫలమైన విరాట్ కోహ్లీ.. వన్డే ఫార్మాట్‌లోనూ అదే పేలవ ప్రదర్శన కనబర్చాడు. గజ్జ గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేకు అందుబాటులోకి వచ్చినా జట్టుకు చేసిన ప్రయోజనం ఏం లేదు. చూడచక్కటి కవర్ డ్రైవ్స్‌తో అలరించిన విరాట్(16).. ఎప్పటిలానే ఔట్‌సైడ్ ఆఫ్ట్ స్టంప్ బాల్‌ను వెంటాడి పెవిలియన్ చేరాడు.

ఫామ్ అందుకోవడానికి విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్ సరైనదని విశ్లేషకులు భావిస్తుండగా.. అతను మాత్రం అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. మరీ చివరి మ్యాచ్‌లోనైనా సత్తా చాటుతాడో లేక అదే వైఫల్యాన్ని కొనసాగిస్తాడో చూడాలి. సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ కూడా ఆశించిన రీతిలో రాణించలేదు. పాండ్యా, జడేజా పరువు కాపాడినా అది సరిపోదు. భారత బ్యాటింగ్ ఆర్డర్ చెలరేగితేనే విజయం సాధ్యం.

 బుమ్రా సారథ్యంలో..

బుమ్రా సారథ్యంలో..

తొలి వన్డేలో నిప్పులు చెరిగిన జస్‌ప్రీత్ బుమ్రా(6/19), మహమ్మద్ షమీ(3/31)లు రెండో వన్డేలోనూ అదే జోరు కనబర్చారు. బుమ్రా(2/49), షమీ(1/48) పొదుపుగా బౌలింగ్ చేశారు. వీరికి హార్దిక్(2/28) నుంచి సహకారం లభించింది. యుజ్వేంద్ర చాహల్(4/47) నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. కానీ మూడో పేసర్ అయిన ప్రసిధ్ కృష్ట(1/53) నే ధారళంగా పరుగులిచ్చాడు. ఓ వికెట్ తీసినప్పటికీ పరుగులను నియంత్రించలేకపోయాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కనపెట్టే చాన్సుంది. మూడో వన్డేలో సత్తా చాటాలంటా బౌలర్లు చెలరేగాల్సిందే.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ/ శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Saturday, July 16, 2022, 13:24 [IST]
Other articles published on Jul 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+