
టీమ్ కాంబినేషన్ ఎలా?
అయితే రీషెడ్యూల్ టెస్ట్ ఆడిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి రావడంతో తుది జట్టు కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విన్నింగ్ కాంబినేషన్‌లో ఏయే ఆటగాళ్లను పక్కనపెడుతారు? ఎవరికి అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశమైంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు చోటు ఖాయం. వీరి కోసం దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్‌పై వేటు పడే అవకాశం ఉంది.

ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ..
రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ తొలి టీ20లో విఫలమైన నేపథ్యంలో అతనిపై వేటు వేసే అవకాశం ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే టీమ్‌మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అప్పుడు కోహ్లీని ఓపెనర్‌గా ఆడించి.. హుడాను ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్ పంపించనున్నారు. అయితే ఇషాన్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం దీపక్ హుడాపై వేటు పడుతుంది. తొలి టీ20లో ధాటిగా ఆడిన రోహిత్.. భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.

సూర్యకు చాన్స్..
మిడిలార్డర్‌లో కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ బరిలోకి దిగనున్నారు. శ్రేయస్ అయ్యర్‌కు బదులు సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకే ప్రాధాన్యత లభించనుంది. ఇక రిషభ్ పంత్ రాకతో దినేశ్ కార్తీక్‌పై వేటు పడనుంది. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి రానున్నాడు. ఒకవేళ కార్తీక్‌ను ఆడించాలనుకుంటే ఇషాన్ కిషన్‌తో పాటు జడేజాపై వేటు వేసే అవకాశం ఉంది.

బుమ్రా సారథ్యంలో..
అర్షదీప్ సింగ్ స్థానంలో బుమ్రా జట్టులోకి రానుండగా.. అతని సారథ్యంలో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. భువీ తొలి టీ20లో సత్తా చాటాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ జట్టులో కొనసాగుతాడు. చాహల్ సైతం ఫస్ట్ టీ20లో సత్తా చాటాడు.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్


Click it and Unblock the Notifications












