Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI vs ENG 2nd ODI:కోహ్లీ ఔట్.. రెండో వన్డే‌లో ఇంగ్లండ్‌తో తలపడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs ENG 2nd ODI: Virat Likely to miss and Shreyas Iyer continue his place

లండన్: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం అందుకున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. లార్డ్స్ వేదికగా గురువారం జరగనున్న రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్.. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటుంది. భారత్ మాత్రం తొలి వన్డే జోరునే కొనసాగించి టీ20 సిరీస్ తరహాలో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఫస్ట్ వన్డే తరహాలోనే ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగనుంది.

ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ ధావన్..

ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ ధావన్..

తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రోహిత్, శిఖర్ ధావన్ జోడీనే రెండో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. వన్డే క్రికెట్‌లో 5000 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఈ జోడీ అదే సమన్వయం కొనసాగించాలనుకుంటుంది. హాఫ్ సెంచరీతో రోహిత్ శర్మ ఆకట్టుకోగా.. శిఖర్ ధావన్ అతనికి సహకారంగా ఆడాడు. అయితే తొలి వన్డేలో లక్ష్యం తక్కువగా ఉండటంతో వీరి పని సులువైంది. రెండో వన్డేలోనూ మంచి శుభారంభం అందించాలని ఈ జోడీ భావిస్తోంది.

విరాట్ కోహ్లీ దూరం..

విరాట్ కోహ్లీ దూరం..

గజ్జ గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేకు కూడా దూరం కానున్నాడు. అతను ఇంకా గాయం నుంచి కోలుకోలేదని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. విరాట్‌కు బదులు తొలి వన్డేలో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ రెండో వన్డేలోనూ కొనసాగనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనుండగా.. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఈ ముగ్గురు ఫినిషర్ పాత్ర పోషించనున్నారు.

 బుమ్రా నేతృత్వంలో..

బుమ్రా నేతృత్వంలో..

తొలి వన్డేలో నిప్పులు చెరిగిన జస్‌ప్రీత్ బుమ్రా(6/19), మహమ్మద్ షమీ(3/31)లు ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. స్వింగ్, పేస్ కండిషన్స్‌ను రెండు చేతులు అందిపుచ్చుకున్నారు. అదే జోరును రెండో వన్డేలోనూ కొనసాగించనున్నారు. వీరికి తోడుగా ఓ స్పిన్, పేస్ ఆల్‌రౌండర్ (జడేజా, హార్దిక్) అందుబాటులో ఉండనున్నారు. బౌలింగ్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా లీడ్ చేయనుండగా.. అతనికి డిప్యూటిగా షమీ ఆడనున్నాడు. ఇక మూడో పేసర్ ప్రసిధ్ కృష్ణ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఏకైక స్పిన్నర్‌గా చాహల్ కొనసాగనున్నాడు.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Wednesday, July 13, 2022, 15:19 [IST]
Other articles published on Jul 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+