India Playing XI vs ENG 1st ODI: ధావన్ ఇన్.. ఇషాన్ ఔట్! తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

లండన్: ఇంగ్లండ్ గడ్డపై మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని ది ఒవల్ మైదానం వేదికగా మంగళవారం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 సిరీస్ ఓడిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. భారత్ మాత్రం టీ20 జోరునే కొనసాగించాలనుకుంటుంది. అయితే వన్డే జట్టులోని ఆటగాళ్లు మారడంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓపెనర్‌గా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ బరిలోకి దిగడం ఖాయం.. బౌలింగ్ లైనప్‌లో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి.

ఓపెనర్లుగా రోహిత్, శిఖర్ ధావన్..
శిఖర్ ధావన్ జట్టులోకి రావడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. రోహిత్‌తో కలిసి శిఖర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఈ ఇద్దరికి మంచి రికార్డు ఉంది. టీ20 సిరీస్‌లో రోహిత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా మోస్తరుగా రాణించాడు. తొలి రెండు టీ20ల్లో జట్టుకు ఘన ఆరంభాలను అందించిన రోహిత్.. చివరి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. వన్డే సిరీస్‌లో రోహిత్ రాణించడం జట్టుకు చాలా ముఖ్యం. మరోవైపు ఐపీఎల్ అనంతరం శిఖర్ ధావన్ నేరుగా ఈ సిరీస్‌లోనే ఆడనున్నాడు. దాంతో అతను ఎలా ఆడుతాడనేదానిపై ఆసక్తి నెలకొంది.

విరాట్ కోహ్లీకి అగ్ని పరీక్ష..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ అగ్ని పరీక్షగా మారనుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ల్లోని రెండు మ్యాచ్‌ల్లో విరాట్ (1, 10) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టు నుంచి తప్పించాలని కపిల్ దేవ్ వంటి దిగ్గజాలు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమ్‌మేనేజ్‌మెంట్ సైతం విరాట్‌కు వన్డే సిరీసే చివరి అవకాశంగా భావిస్తోంది. మరోవైపు కోహ్లీకి ఎసరు పెట్టేందుకు యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడాలు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కోహ్లీ ఒకప్పటి బ్యాట్స్‌మెన్‌లా చెలరేగాలి.

అయ్యర్ ఔట్.. సూర్యకు చాన్స్..
విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనుండగా.. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఆడనున్నాడు. అతనికి శ్రేయస్ అయ్యర్‌తో పోటీ ఉన్నా.. టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సెంచరీ బాదిన సూర్యకే టీమ్‌మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వనుంది. వికెట్ కీపర్ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. ఈ ముగ్గురు ఫినిషర్ పాత్ర పోషించనున్నారు.

బుమ్రా నేతృత్వంలో..
ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు ఓ స్పిన్నర్‌తో టీమిండియా ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది. వీరికి తోడుగా ఓ స్పిన్, పేస్ ఆల్‌రౌండర్ (జడేజా, హార్దిక్) అందుబాటులో ఉండనున్నారు. బౌలింగ్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా లీడ్ చేయనుండగా.. అతనికి డిప్యూటిగా షమీ ఆడనున్నాడు. ఇక మూడో పేసర్ ఎవరా? అనేది తేలాల్సి ఉంది. బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇస్తారా? లేక ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌లో ఒకరికి చాన్స్ ఇస్తారా? అనేది చూడాలి. షమీకి రెస్ట్ ఇచ్చి యువ పేసర్లను ఆడించే అవకాశం కూడా ఉంది. ఏకైక స్పిన్నర్‌గా చాహల్ స్థానానికి డోకా లేదు.

తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications