
దీపక్ హుడా ఔట్...
పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత్.. సౌతాఫ్రికాతో మాత్రం బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో తెలిపోయింది. ఈ మ్యాచ్‌కే విన్నింగ్ కాంబినేషన్‌ను డిస్టర్బ్ చేసిన రోహిత్.. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకొచ్చాడు. కానీ అతను దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే భారత తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. దీపక్ హుడాను మళ్లీ బెంచ్‌కే పరిమితం చేసి అక్షర్ పటేల్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించగలడు. నెదర్లాండ్స్‌తో అతను బౌలింగ్‌లో సత్తా చాటాడు.

రిషభ్ పంత్‌కు చాన్స్..
గత మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌తో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో గాయపడటం, బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమవ్వడంతో రిషభ్ పంత్‌ను తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. ఆసీస్ గడ్డపై కార్తీక్ ఆడలేడని, అక్కడ బెంగళూరు తరహా పిచ్‌లు లేవని సెహ్వాగ్ వంటి మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పించారు. ఆసీస్ గడ్డపై పంత్‌కు మంచి అనుభవం ఉందని, అతన్ని జట్టులోకి తీసుకురావడం వల్ల లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా సెట్ అవుతుందని పేర్కొంటున్నారు. అవసరమైతే దీపక్ హుడా స్థానంలోనైనా రిషభ్ పంత్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. కార్తీక్‌ను కొనసాగించాలనుకుంటే అక్షర్‌ను పక్కనపెట్టి మరీ పంత్‌ను తీసుకోవచ్చు.

రాహుల్‌కు రక్షణగా వైస్ కెప్టెన్సీ..
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గత మూడు మ్యాచ్‌ల్లో(4,9, 9) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే జట్టు వైస్ కెప్టెన్ అతనే కావడంతో టీమ్‌మేనేజ్‌మెంట్ పక్కనపెట్టే సాహసం చేయడం లేదు. వైస్ కెప్టెన్సే లేకుంటే అతనిపై ఇప్పటికే వేటు పడేది. రాహుల్ ద్రవిడ్ సైతం.. మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌కు అండగా నిలిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్, సూర్య అదే జోరు కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. హార్దిక్ సైతం తన సత్తా చాటాల్సి ఉంది.

చాహల్‌కు తప్పని నిరీక్షణ...
టీమిండియా బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. భారత పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో కూడా యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం దక్కేలా లేదు. అశ్విన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. అడిలైడ్ వికెట్‌పై స్పిన్నర్ల ప్రభావం అంతగా ఉండకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ క్రమంలోనే అశ్విన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్


Click it and Unblock the Notifications












