Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN 2nd T20I: తెలుగోడితో పాటు అతనికి నిరాశే.. మార్పులు లేకుండా టీమిండియా!

బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం న్యూఢిల్లీ వేదికగా జరిగే రెండో టీ20లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి టీ20ని ఏకపక్షంగా గెలుచుకున్న టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కనబర్చాలనుకుంటోంది.

మరోవైపు టెస్ట్ సిరీస్‌లో క్లీన్ స్వీప్ అవ్వడంతో పాటు తొలి టీ20లో ఘోర పరాజయం ఎదుర్కొన్న బంగ్లాదేశ్.. టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ వైఫల్యాన్ని అధిగమించి.. రెండో టీ20లో గెలిచి సిరీస్ డిసైడర్‌కు దారితీయాలనే పట్టుదలతో ఉంది. ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆఫ్షన్స్‌తో గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగం ఫలించింది.

India Playing XI VS Bangladesh For 2nd T20I No Place For Tilak Verma and Ravi Bishnoi

దాంతో తుది జట్టులో మార్పు చేయకుండానే రెండో టీ20లో విన్నింగ్ టీమ్‌ను బరిలోకి దించాలని టీమిండియామేనేజ్‌మెంట్ భావిస్తోంది. జట్టులో ఒకే ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఉండటంతో సంజూ శాంసన్‌‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేశారు. దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మ రనౌట్ అయినా.. సంజూ శాంసన్ ఆకట్టుకున్నాడు.

దాంతో ఈ ఇద్దరే ఓపెనర్లుగా కొనసాగనున్నారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అరంగేట్ర ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కాస్త ఒత్తిడికి గురై తడబడ్డా అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. రియాన్ పరాగ్, రింకూ సింగ్‌లకు తొలి టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ ఇద్దరూ కూడా కొనసాగనున్నారు.

స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగనున్నాడు. మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన అతను మూడు వికెట్లతో సత్తా చాటాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఆడనున్నారు.
దాంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న తిలక్ వర్మ, నితీశ్ రాణా, జితేశ్ శర్మలకు నిరాశే ఎదురవ్వనుంది. టీమిండియా రెండో టీ20 గెలిస్తే.. చివరి మ్యాచ్‌‌లో ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వవచ్చు.

భారత్ తుది జట్టు(అంచనా):
సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు
సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ, తిలక్ వర్మ

Story first published: Monday, October 7, 2024, 22:09 [IST]
Other articles published on Oct 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+