India Playing XI: అక్షర్ పటేల్ ఔట్.. ఆ యువ స్పిన్నర్ అరంగేట్రం! బంగ్లాతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు ఇదే

చట్టోగ్రామ్: బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మరో రసవత్తర పోరాటానికి సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో కోల్పోయిన భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సమాయత్తమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలంటే టీమిండియా ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో బుధవారం చట్టోగ్రామ్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
గాయాల కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్లు బుమ్రా, షమీ, స్పిన్నర్ రవీంద్ర జడేజాలు ఈ సిరీస్‌కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో తుది జట్టు ఎంపిక టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా బౌలింగ్ కాంబినేషన్‌పై ఎటు తేల్చుకోలేకపోతుంది.

ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో దూరమైన నేపథ్యంలో బ్యాకప్ ఓపెనర్ అయిన శుభ్‌మన్ గిల్ అతని స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. రోహిత్ శర్మ గాయంతో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి వచ్చినా అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. గత కొంతకాలంగా శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తుండటంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతని వైపే మొగ్గు చూపనుంది. అయితే రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనుకుంటే మాత్రం అభిమన్యు ఈశ్వరన్‌కు అవకాశం దక్కవచ్చు.

రిషభ్ పంత్‌కు అగ్ని పరీక్ష
ఫస్ట్ డౌన్‌లో వైస్ కెప్టెన్, నయావాల్ చతేశ్వర్ పుజారా ఆడనుండగా.. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పర్వాలేదనిపించిన పుజారా.. ఈ సిరీస్‌లో రాణిస్తేనే జట్టులో కొనసాగుతాడు. లేదంటే అతని కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడుతోంది. మూడో వన్డేలో సెంచరీ బాది జోరు మీదున్న కోహ్లీ.. టెస్ట్ ఫార్మాట్‌లోనూ శతక నిరీక్షణకు తెరదించాలనుకుంటున్నాడు. వన్డేల్లో సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్ కూడా టెస్ట్ టీమ్‌లో చోటు ఖాయం చేసుకోవాలని భావిస్తున్నాడు. అయితే రాహుల్ మిడిలార్డర్‌లో ఆడితే అతను బెంచ్‌కే పరిమితమవుతాడు. ఆరోస్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్ పంత్‌కు అగ్ని పరీక్ష. రాణిస్తేనే జట్టులో కొనసాగుతాడు లేకుంటే.. ఉద్వాసనకు గురవుతాడు.

సౌరభ్ కుమార్ అరంగేట్రం..
రవీంద్ర జడేజా గైర్హాజరీలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానంలో బరిలోకి దిగుతాడు. అయితే అక్షర్ పటేల్‌కు బదులు యువ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్-ఏ తరఫున బంగ్లాదేశ్‌పై 15 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్ వైపు టీమ్‌మేనేజ్‌మెంట్ ఎక్కువ మొగ్గు చూపనుంది. అయితే సీనియర్ అయిన అక్షర్ పటేల్‌కు బ్యాటింగ్ చేసే సామర్థ్యం అదనపు బలం. అనుభవానికి ఓటేస్తే అక్షర్‌కు అవకాశం దక్కుతుంది.
పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ ఆడటం ఖాయం కాగా.. మూడో పేసర్‌గా జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికీ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉంది. దేశవాళీలో దుమ్మురేపడంతో 12 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఉనాద్కత్.. తుది జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.

తుది జట్టు(అంచనా)
కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, సౌరభ్ కుమార్/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్/జయదేవ్ ఉనాద్కత్, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications