India Playing XI: ఆ ముగ్గురికి నో ఛాన్స్! బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. సుమారు 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతుంది. గురువారం నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని విజయానికి కావాల్సిన వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి.
ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ఆకాశ్ దీప్, యశ్ దయాల్‌లు భారత టెస్ట్ టీమ్‌కు ఎంపికయ్యారు. దాంతో భారత తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఎక్స్‌ట్రా స్పిన్నరా..? పేసరా..?
అంతేగాకుండా టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా? లేక ముగ్గురు పేసర్లతో ఆడుతుందా? అనేదానిపై స్పష్టత లేదు. చెన్నైలోని చెపాక్ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ పిచ్ సిద్దం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వికెట్‌పై కాస్త గ్రాస్ కూడా వదిలేసారని, పేసర్లకు అనుకూలంగా ఉండేలా సిద్దం చేశారని కొన్ని వెబ్‌సైట్స్ పేర్కొనగా.. మరికొన్ని మాత్రం స్పిన్ పిచ్ అని అంచనా వేసాయి.
బౌలింగ్ వ్యూహంపైనే టీమిండియా కాంబినేషన్ ఆధారపడి ఉంది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే రవిచంద్రన్ అశ్విర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు దక్కుతుంది. అక్షర్ పటేల్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు.
సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్‌కు నో ఛాన్స్..
ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే యశ్‌దయాల్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విభాగంలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ రీఎంట్రీతో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కు పరిమితం కానున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడనుండగా.. ఫస్ట్ డౌన్‌లో శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నాడు.
విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడనుండగా.. రిషభ్ పంత్ ఐదో స్థానంలో, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. జడేజా ఏడో స్థానంలో, అశ్విన్ 8వ స్థానంలో బరిలోకి దిగనున్నారు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/యశ్ దయాల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications