ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఆడబోతుంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై రెండు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి టెస్ట్ కోసం భారత సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లంతా రీఎంట్రీ ఇచ్చారు. దాంతో తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఒకటి రెండు స్థానాలపై మాత్రమే సందిగ్ధత నెలకొంది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? యువ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమిస్తారా? అన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ విషయంలో రోహిత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలతో పాటు రిషభ్ పంత్ స్థానం ఖాయమైంది.

ఆరో బ్యాటర్‌గా రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరిలో ఒకరే ఆడే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్.. 3 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. మొత్తం 200 పరుగులతో అరంగేట్ర సిరీస్‌లోనే ఆకట్టుకున్నాడు. ఈ ఫామ్ నేపథ్యంలో అతనికే అవకాశం ఇవ్వాలి. కానీ అనుభవం, గత రికార్డ్‌లను పరిగణలోకి తీసుకుంటే రాహుల్‌నే తుది జట్టులోకి తీసుకోవాలి.
హైదరాబాద్ వేదికగా జరిగిన తన చివరి టెస్ట్‌లోనూ రాహుల్ 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. తన చివరి విదేశీ పర్యటనలోనూ కేఎల్ రాహుల్ సౌతాఫ్రికాపై సెంచరీ సాధించాడు.
అలాంటి రాహుల్ చోటివ్వకపోతే అన్యాయం చేశారనే విమర్శలు వస్తాయి. అయితే ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగితే మాత్రం రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరూ తుది జట్టులోకి వస్తారు. స్పిన్‌కు అనుకూలంగా ఉండే చెన్నై వేదికగా తొలి టెస్ట్ జరగనుంది.
టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఓ పేసర్‌తో బరిలోకి దిగితే సర్ఫరాజ్, రాహుల్ ఆడే అవకాశం ఉంటుంది. కానీ నలుగురు బౌలర్లతోనే టెస్ట్ మ్యాచ్ ఆడటం బూమారాంగ్ అవుతోంది. సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు అయినా ఎక్స్‌ట్రా పేసర్ ఉండాలి. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ పేరు దులీప్ ట్రోఫీ రివైజ్డ్ టీమ్‌లో నుంచి తొలగించలేదు. ఈ లెక్కన అతను తొలి టెస్ట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.
బంగ్లాతో తొలి టెస్ట్ ఆడే భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.