బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్దమైంది. గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగే తొలి టీ20లో పర్యాటక బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్లందరికి ఈ సిరీస్ నుంచి భారత సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది కుర్రాళ్లతో ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేశారు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెగ్యులర్‌గా ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో.. తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఓపెనర్‌గా సంజూ శాంసన్..
టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ను ఈ సిరీస్‌కు దూరంగా ఉంచారు. దాంతో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడనుండగా.. రియాన్ పరాగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా.. రింకూ సింగ్ ఆరో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఏడో స్థానంలో ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్ బరిలోకి దిగనున్నాడు.
మయాంక్, హర్షిత్ రాణా అరంగేట్రం..
పేస్ బాధ్యతలను అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాలు పంచుకోనున్నారు. ఈ ఇద్దరికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్, ఆల్‌రౌండర్ కావాలనుకుంటే మాత్రం హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తీ లేదా శివమ్ దూబే బరిలోకి దిగవచ్చు. హార్దిక్ పాండ్యా రూపంలో స్టార్ ఆల్‌రౌండర్ ఉన్న నేపథ్యంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
భారత తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టు:
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, జితేశ్ శర్మ.