For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI:రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠికి మళ్లీ నిరాశే! బంగ్లాతో మూడో వన్డే ఆడే భారత జట్టు ఇదే!

India Playing XI vs BAN for 3rd ODI: No chance for Rajat, Tripathi after Rohit, Deepak and Kuldeep ruled out

హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనలో మరోసారి దారుణంగా విఫలమైన టీమిండియా నామమాత్రపు చివరి వన్డేకు సిద్దమైంది. శనివారం చటోగ్రామ్ వేదికగా జరగనున్న ఆఖరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి 0-2తో సిరీస్ కోల్పోయిన భారత్ పరువు కోసం పాకులాడుతోంది. చివరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి ఉత్సాహంగా టెస్ట్ సిరీస్‌‌లో బరిలోకి దిగాలనుకుంటుంది. అయితే టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది.

సిరీస్ ప్రారంభానికి ముందే మహహ్మద్ షమీ, రిషభ్ పంత్ దూరం కాగా.. రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా గాయపడ్డాడు. యువ పేసర్ కుల్దీప్ సేన్ వెన్ను నొప్పితో.. స్టార్ పేసర్ దీపక్ చాహర్ తొడ కండరాల గాయంతో రోహిత్‌తో పాటు స్వదేశం బయల్దేరారు. మెరుగైన చికిత్స కోసం రోహిత్ భారత్‌కు వెళ్లినట్లు రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

అందుబాటులో ఉన్నది 13 మంది..

అందుబాటులో ఉన్నది 13 మంది..

ఒకేసారి ముగ్గురు ఆటగాళ్లు దూరమవడం టీమిండియాకు సవాల్‌గా మారింది. అందుబాటులో ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే చివరి వన్డేకు సిద్దం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక భారత్‌కు ముగ్గురు పేసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వారిలో ఎవరూ గాయపడినా.. టీమిండియాకు కష్టాలు తప్పవు.

ఈ విపత్కర పరిస్థితుల్లో తుది జట్టు ఎంపిక వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సవాల్‌గా మారింది. 13 మందిలో ఎవరితో ఆడాలి.. పక్కనపెట్టాల్సిన ఇద్దరు ఎవరు? అనే విషయాలు సంక్లిష్టంగా మారాయి. దీపక్ చాహర్ ప్లేస్‌ను ఎవరితో భర్తీ చేయాలనేది కూడా తలనొప్పిగా మారింది.

ఓపెనర్లుగా రాహుల్, శిఖర్ ధావన్..

ఓపెనర్లుగా రాహుల్, శిఖర్ ధావన్..

రోహిత్ శర్మ గాయం నేపథ్యంలో కేఎల్ రాహుల్ మళ్లీ ఓపెనింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శిఖర్ ధావన్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. తొలి వన్డేలో విరోచిత పోరాటం కనబర్చిన రాహుల్.. రెండో వన్డేలో మాత్రం విఫలమయ్యాడు. తన సారథ్యంలో ఆడుతున్న మూడో వన్డేలో రాహుల్ రాణించడం కీలకం. మరోవైపు శిఖర్ ధావన్ రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

పూర్తి జట్టు అందుబాటులో ఉండి ఉంటే అతనిపై వేటు వేసేవారు. కానీ గాయాల కారణంగా అతనికి మరో అవకాశం దక్కనుంది. అతని అనుభవం కోసమైనా చివరి వన్డేలో ధావన్ ఆడటం ఖాయం.

రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠికి నిరాశే..

రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠికి నిరాశే..

ముగ్గురు గాయాలతో దూరమైనా.. యువ బ్యాటర్లు రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠిలకు అవకాశం దక్కేలా లేదు. అందుబాటులో ఉన్న 13 మంది ఆటగాళ్లలో ఈ ఇద్దరే బెంచ్‌కు పరిమితం కానున్నారు. ఫస్ట్ డౌన్‌లో విరాట్.. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా.. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా ఐదో స్థానంలో బరిలోకి దిగుతాడు. ఒక వేళ రజత్ పటీదార్, రాహుల్ త్రిపాఠిల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తే రజత్ పటీదార్‌కు చోటు దక్కవచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, షెహ్‌బాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్ ఆడటం ఖాయం.

ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఈ ముగ్గురు ఆడుతారు. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే షెహ్‌బాజ్ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. ముగ్గురు పేసర్లే ఉన్న నేపథ్యంలో టీమిండియా ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్‌తో ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

భారత తుది జట్టు (అంచనా)

భారత తుది జట్టు (అంచనా)

భారత్: కేఎల్ రాహుల్( వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), అక్షర్ పటేల్, షెహ్‌బాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Thursday, December 8, 2022, 13:13 [IST]
Other articles published on Dec 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+