IND vs AUS: ఆసీస్‌తో నాలుగో టెస్ట్.. జట్టులోకి సూర్యకుమార్ యాదవ్!

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్ట్‌కు టీమిండియా సన్నదమవుతోంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆసీస్‌తో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్ట్‌ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను కూడా ఖరారు చేసుకోవాలనుకుంటోంది.
మరోవైపు ఇండోర్ టెస్ట్‌లో ఇండియాను చిత్తు చేసిన ఆసీస్ అదే జోరులో ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ రానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మహమ్మద్ సిరాజ్‌కు రెస్ట్..
విశ్రాంతి పేరిట ఇండోర్ టెస్ట్‌కు దూరమైన మహమ్మద్ షమీ చివరి మ్యాచ్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్రకారం ఈ మ్యాచ్ నుంచి సిరాజ్‌కు విశ్రాంతి కల్పించనున్నారు. వన్డే సిరీస్‌కు అతన్ని ఫ్రెష్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సిరాజ్ స్థానంలో మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమై వేటుకు గురైన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అతని స్థానంలో ఇండోర్ టెస్ట్ ఆడిన శుభ్‌మన్ గిల్ ఆకట్టుకోలేకపోయినా.. అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు.

పిచ్‌పైనే టీమ్ కాంబినేషన్..
ఇక అహ్మదాబాద్ టెస్ట్‌కు ఉపయోగించే పిచ్‌ను బట్టి టీమిండియా తమ కాంబినేషన్‌ను ఎంపిక చేయనుంది. ఇండోర్ పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన నేపథ్యంలో అహ్మదాబాద్ టెస్ట్‌లో కాస్త బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు రెడ్, బ్లాక్ సాయిల్స్‌తో కూడిన రెండు పిచ్‌లను సిద్దం చేశారు.
త్వరలోనే ఈ రెండు వికెట్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెడ్ సాయిల్ పిచ్ ఎంచుకుంటే టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగాల్సి ఉంటుంది.

బ్యాటింగ్ బలగం కోసం సూర్య..
బ్యాటింగ్ వైఫల్యంతోనే మూడో టెస్ట్‌లో విఫలమైన టీమిండియా.. ఈ బలహీనతను అధిగమించడంపై ఫోకస్ పెట్టింది. మిడిలార్డర్‌లో అటాకింగ్ ఆప్షన్ కోసం ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవాలనుకుంటుంది. స్పిన్ పిచ్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నామని కెప్టెన్ రోహిత్ ఇప్పటికే స్పష్టం చేయగా.. ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులో ఉండనున్నారు.
అయితే సూర్యకోసం ఓ పేసర్‌ను టీమిండియా పక్కనపెట్టనుంది. గత మూడు టెస్ట్‌ల్లో పేసర్లు రాణించేందేం లేదు. రెండో టెస్ట్‌లో షమీ, మూడో టెస్ట్‌లో ఉమేశ్ రాణించినా.. వాళ్లు వేసిన ఓవర్లు చాలా తక్కువ ఈ క్రమంలోనే నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఎలా ఉంటుందనేదానిపై టీమ్‌మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేస్తోంది.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్/ఉమేశ్ యాదవ్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications