For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: సిరాజ్‌పై వేటు.. షమీ రీఎంట్రీ.. ఆసీస్‌తో నాలుగో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

 India Playing XI vs Australia for 4th Test: Mohammed Shami likely to replace Mohammed Siraj

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి పరాజయాన్ని చవి చూసిన టీమిండియా ఫైనల్ పోరుకు సిద్దమవుతోంది. ఊహించని ఓటమి.. భారత జట్టు లొసుగులను బయటపెట్టింది. దాంతో తమ తప్పిదాలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన రోహిత్ సేన.. అహ్మదాబాద్ వేదికగా గురువారం(మార్చి 9) నుంచి ప్రారంభం కానున్న చివరి టెస్ట్‌కు సమయాత్తం అవుతోంది. ఈ సిరీస్ గెలవాలన్నా.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలన్నా ఈ మ్యాచ్‌ గెలవడం టీమిండియాకు తప్పనిసరి. ఇండోర్ పిచ్‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇవ్వడంతో అహ్మదాబాద్ వేదికగా ఎలాంటి పిచ్ సిద్దం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో విజయాన్నందుకున్న ఆసీస్ అదే జోరులో అహ్మదాబాద్ టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటుంది.

మహమ్మద్ సిరాజ్‌పై వేటు..

మహమ్మద్ సిరాజ్‌పై వేటు..

విన్నింగ్ కాంబినేషన్‌ను కాదని రెండు మార్పులతో ఇండోర్ టెస్ట్ బరిలోకి దిగిన టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. కేఎల్ రాహుల్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ సైతం పేలవ ప్రదర్శన కనబర్చాడు. మహమ్మద్ షమీ స్థానంలో బరిలోకి దిగిన ఉమేశ్ యాదవ్ మాత్రం బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. దాంతో అతను చివరి టెస్ట్‌లోనూ అవకాశం అందుకోనున్నాడు. మరోవైపు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా మూడో టెస్ట్‌ నుంచి మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వగా.. అతను ఆఖరి టెస్ట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అప్పుడు హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. టర్నింగ్ ట్రాక్స్ కావడంతో గత మూడు మ్యాచ్‌ల్లో సిరాజ్ ఫీల్డింగ్‌కే పరిమితమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క వికెట్ తీసాడు. దాంతో సిరాజ్‌ను ఆఖరి టెస్ట్‌కు పక్కనపెట్టనున్నారు.

శుభ్‌మన్ గిల్‌కు మరో చాన్స్..

శుభ్‌మన్ గిల్‌కు మరో చాన్స్..

పేలవ ఫామ్‌తో విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌ను కాదని శుభ్‌మన్ గిల్‌ను ఆడిస్తే అతను దారుణంగా విఫలమయ్యాడు. గింగిరాలు తిరిగిన వికెట్‌పై అందరి బ్యాట్స్‌మెన్‌లానే తడబడ్డాడు. అయితే అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు. దాంతో కేఎల్ రాహుల్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే కీపింగ్‌లో ఆకట్టుకుంటున్నా.. బ్యాటింగ్‌లో తడబడుతున్న కేఎస్ భరత్‌ స్థానంలో రాహుల్‌ను ఆడించాలనుకుంటే మాత్రం తెలుగు ప్లేయర్‌పై వేటు పడనుంది. కీపింగ్‌కే ప్రాధాన్యత ఇస్తే మాత్రం కేఎస్ భరత్ జట్టులో కొనసాగుతాడు.

ఈ ఒక్క మార్పు తప్పా...

ఈ ఒక్క మార్పు తప్పా...

శుభ్‌మన్ గిల్‌.. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయనుండగా.. మిడిలార్డర్‌లో చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగుతారు. మూడో టెస్ట్‌లో పుజారా, అయ్యర్ పర్వాలేదనిపించినా.. కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. అతని పేలవ ఫామ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీకి చివరి టెస్ట్ కీలకంగా మారింది. ఆ తర్వాత జడేజా, కేఎస్ భరత్, అక్షర్ పటేల్ ఆడనున్నారు. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ పరంగా అక్షర్ పటేల్ సేవలను టీమిండియా సరిగ్గా వాడుకోలేకపోయింది. తొలి రెండు టెస్ట్‌ల్లో సత్తా చాటిన జడేజా ఇండోర్‌లో మాత్రం తేలిపోయాడు. కేస్ భరత్ కీపింగ్‌లో అదరగొడుతున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అతను బ్యాటింగ్‌ మెరుగుపరుచుకోవాల్సి ఉంది.

ప్చ్.. కుల్దీప్ యాదవ్..

ప్చ్.. కుల్దీప్ యాదవ్..

బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా పెద్దగా మార్పులు చేసే చాన్సే లేదు. అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్‌లో కీలకం కాగా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌తో పాటు లోయరార్డర్‌లో కీలక పరుగులు చేస్తుండటంతో ఈ ముగ్గురిని జట్టులో తప్పకుండా కొనసాగించనున్నారు. అహ్మదాబాద్‌లో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ పరంగా మంచి రికార్డు ఉంది. ఇండోర్ వికెట్‌‌కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన నేపథ్యంలో కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను అహ్మదాబాద్‌లో సిద్దం చేయనున్నారు. దాంతో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుంది. కుల్దీప్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అశ్విన్ ఏమైనా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటే మాత్రం కుల్దీప్ జట్టులోకి వస్తాడు. మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు ఎవరైనా గాయపడితే బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుంది..

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్/ఉమేశ్ యాదవ్

Story first published: Saturday, March 4, 2023, 15:47 [IST]
Other articles published on Mar 4, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+