
భువీ ఇన్..రిషభ్ పంత్ ఔట్!
కాన్పూర్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకే కుదించడంతో టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగింది. దాంతో చివరి నిమిషంలో భువనేశ్వర్‌కు బదులు రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. అయితే ఉప్పల్ వేదికగా పూర్తి మ్యాచ్ జరగనుండటంతో మళ్లీ భువీ జట్టులోకి రానున్నాడు. దాంతో పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక ఉప్పల్ పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉండి బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. దాంతో బౌలర్లకు మరోసారి కష్టాలు తప్పేటట్లు లేవు. కాబట్టి టీమిండియా ఎక్స్‌ట్రా బౌలర్‌తోనే బరిలోకి దిగనుంది.

చాహల్ డౌట్..
వరుసగా రెండు టీ20ల్లో దారుణంగా విఫలమైన యుజ్వేంద్ర చాహల్ చివరి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఆసియాకప్ వైఫల్యాన్నే కొనసాగిస్తుండటంతో అతన్ని పక్కనపెట్టి అశ్విన్ తీసుకునే ప్రయత్నం టీమ్‌మేనేజ్‌మెంట్ చేయవచ్చు. లేదా మరో అవకాశం ఇవ్వవచ్చు. చాహల్‌పై వేటు వేస్తే అశ్విన్ బరిలోకి దిగుతాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల స్పిన్నర్లు ఇప్పుడు జట్టుకు అవసరం. అక్షర్ పటేల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టడంతో అతని చోటుకు డోకాలేదు. హర్షల్ పటేల్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో అతన్ని కూడా పక్కనపెట్టవచ్చు. లేదా మరో అవకాశం ఇవ్వచ్చు. పక్కనపెడితే మాత్రం దీపక్ చాహర్ జట్టులోకి రానున్నాడు.

బ్యాటింగ్‌లో మార్పుల్లేవ్..
రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొట్టడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉండకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. ఫినిషర్‌గా దినేశ్ కార్తీక్ అదరగొట్టడం కూడా జట్టుకు మేలు చేసే విషయమే. రెండో మ్యాచ్‌లో చివరి రెండు బంతుల్లో 6, 4తో అసలు సిసలు ఫినిషర్ అనిపించిన కార్తీక్.. తన ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా సత్తా చాటాల్సి ఉంది. ముఖ్యంగా కోహ్లీకి హైదరాబాద్ ఫేవరేట్ గ్రౌండ్. చివరి సారిగా ఇక్కడ విండీస్‌తో జరిగిన టీ20లో విరాట్ 94 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా ఇక్కడ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 53.62 సగటుతో రన్స్ చేశాడు. దాంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్/దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్/ రవిచంద్రన్ అశ్విన్


Click it and Unblock the Notifications












