Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ఇద్దరికీ మళ్లీ నిరాశే.. ఆసీస్‌తో మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

India Playing XI vs Australia for 3rd T20: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. నేడు(మంగళవారం) గువహతి వేదికగా జరగనున్న మూడో టీ20లో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు టీ20లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి 3-0తో సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.

మరోవైపు తొలి రెండు టీ20ల్లో ఎదురైన అనూహ్య పరాజయాల నుంచి తేరుకోవాలని ఆసీస్ భావిస్తోంది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. తొలి రెండు టీ20ల్లో బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.

 India Playing XI vs Australia for 3rd T20: No Chance for Shivam Dube and Washington Sundar

అయితే గువహతి పిచ్ స్వింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేస్ ఆప్షన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే శివమ్ దూబేను జట్టులోకి తీసుకుంటే ఎవర్ని పక్కనపెట్టాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. టాప్-6 బ్యాటర్లలో తిలక్ వర్మ మినహా అంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

తిలక్ వర్మకు కూడా పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. శివమ్ దూబేను ఆడించాలనుకుంటే మాత్రం తిలక్ వర్మపైనే వేటు పడనుంది. విన్నింగ్ కాంబినేషన్‌ను టీమిండియా మార్చకపోవచ్చు. అదే జరిగితే శివమ్ దూబే ఈ మ్యాచ్‌కు కూడా బెంచ్‌పైనే కూర్చోవాల్సి ఉంటుంది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోయినా.. ఈ ఇద్దరికీ మరో అవకాశం దక్కనుంది.

దాంతో వాషింగ్టన్ సుందర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న తర్వాత చివరి రెండు టీ20ల్లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్ ఆలోచన. బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

బౌలింగ్‌లో ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ పర్వాలేదనిపిస్తున్నారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ యార్కర్లతో బెంబేలెత్తిస్తున్నాడు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ కూడా సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు.

ఆసీస్‌తో మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ

టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Story first published: Tuesday, November 28, 2023, 8:19 [IST]
Other articles published on Nov 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+