For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: శుభ్‌మన్ గిల్ ఇన్.. సూర్య ఔట్! ఆసీస్‌తో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

India Playing XI vs Australia for 2nd Test: Shubman Gill In and Suryakumar Yadav Out

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో ఆసీస్‌ను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు భారత స్పిన్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడిన ఆసీస్.. పాఠాలు నేర్చుకుంటుంది.

ఢిల్లీ టెస్ట్‌లోనైనా విజయం సాధించాలనే తపనతో సన్నదమవుతోంది. ఇప్పటికే నాగ్‌పూర్ మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పై ప్రాక్టీస్ సెషన్ నిర్వహించిన ఆసీస్.. వికెట్ స్వభావం తెలుసుకోవడంతో పాటు భారత స్పిన్ విభాగానికి కౌంటర్ అటాక్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దాంతో రెండో టెస్ట్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను అందివ్వనుంది.

మార్పుల్లేకుండా భారత్..

మార్పుల్లేకుండా భారత్..

రెండో టెస్ట్‌లోనూ టీమిండియా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో కూడా నాగ్‌పూర్ తరహా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌నే సిద్దం చేయనున్నారు. దాంతో ఎలాంటి మార్పులు లేకుండా తొలి టెస్ట్ టీమ్‌ను కొనసాగించాలనుకుంటోంది. ఒకవేళ ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మాత్రం తొలి టెస్ట్ విఫలమైన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు పడవచ్చు.

అది కూడా శుభ్‌మన్ గిల్‌ను జట్టులోకి తీసుకురావాలనుకుంటేనే అతన్ని పక్కనపెడతారు. లేకుండా అదే టీమ్ కొనసాగుతోంది. వాస్తవానికి సూర్యతో పాటు తొలి టెస్ట్‌లో కోహ్లీ, పుజారా, రాహుల్, కేఎస్ భరత్ విఫలమయ్యారు.

కేఎల్ రాహుల్‌కు మరో చాన్స్..

కేఎల్ రాహుల్‌కు మరో చాన్స్..

టీమ్ కోర్ మెంబర్స్ అయిన కోహ్లీ, పుజారా‌లను తప్పించే సాహసం టీమ్‌మేనేజ్‌మెంట్ చేయదు. కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నా.. వైస్ కెప్టెన్సీ అతనికి రక్షణగా ఉంది. అంతేకాకుండా కెప్టెన్, కోచ్ అతన్ని బ్యాకప్ చేస్తున్నారు.

రాహుల్.. రోహ్లీ, కోహ్లీ తరహా ప్లేయరని, అతను త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని బ్యాటింగ్ విక్రమ్ రాథోడ్ చెప్పిన మాటలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.కపిల్ దేవ్ వంటి మాజీ ఆటగాళ్లు రాహుల్‌ను పక్కనపెట్టాలని సూచిస్తున్నా... అతనికి మరో అవకాశం ఇవ్వనున్నారు.

సూర్యపై వేలాడుతున్న కత్తి..

సూర్యపై వేలాడుతున్న కత్తి..

శుభ్‌మన్ గిల్‌ను ఆడించాలనుకుంటే మాత్రం సూర్య కుమార్ యాదవ్‌ను పక్కనపెడుతారు. తొలి టెస్ట్‌తోనే సుదీర్ఘ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య.. 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ఒక వేళ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వస్తే అతన్ని ఓపెనర్‌గా ఆడించవచ్చు. అప్పుడు కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడుతారు.

రాహుల్ ఓపెనర్‌గా కొనసాగితే శుభ్‌మన్ మిడిలార్డర్‌లో ఆడుతారు. పిచ్ కండిషన్స్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అటాకింగ్ ఆప్షన్ ఉండాలని భావిస్తే సూర్య కూడా జట్టులోనే ఉంటాడు. అప్పుడు వికెట్ కీపర్ కేఎస్ భరత్‌పై వేటు వేసి రాహుల్‌తో కీపింగ్ చేయిస్తారు. కీపింగ్ చేస్తే మాత్రం రాహుల్ మిడిలార్డర్‌లో ఆడుతాడు.

కుల్దీప్ యాదవ్‌కు నిరాశే..

కుల్దీప్ యాదవ్‌కు నిరాశే..

రెండో టెస్ట్‌లోనూ టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగనుంది. తొలి టెస్ట్‌లో అక్షర్ వికెట్లు తీయకపోయినా.. బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. సూపర్ బ్యాటింగ్‌తో జట్టు విజయానికి బాటలు వేసాడు. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు కూడా తీసాడు. కాబట్టి రెండో టెస్ట్‌లోనూ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దక్కేలా లేదు.

అతను మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. పేసర్లు సిరాజ్, మహమ్మద్ షమీలకు తిరుగు లేదు. ఈ ఇద్దరూ బంతితో పాటు బ్యాట్‌తోనూ సత్తా చాటారు. ముఖ్యంగా షమీ క్విక్ ఫైర్ నాక్‌తో జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ సమయానికి ఎవరైనా గాయపడితే జట్టులో మార్పులు అనివార్యమవుతాయి.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శుభ్‌మన్ గిల్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్

Story first published: Tuesday, February 14, 2023, 11:59 [IST]
Other articles published on Feb 14, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+