For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. కేఎస్ భరత్‌పై వేటు! ఆసీస్‌తో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

India Playing XI vs Australia for 2nd Test: Shreyas Iyer Returns and KS Bharat doubt

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో ఆసీస్‌ను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం చవి చూసిన ఆసీస్.. పాఠాలు నేర్చుకుంటుంది. ఢిల్లీ టెస్ట్‌లోనైనా విజయం సాధించాలనే తపనతో సన్నదమవుతోంది. ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీకి చేరుకోగా.. ఆసీస్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.

శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ..

శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ..

వెన్ను గాయంతో తొలి టెస్ట్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకున్నాడు. రెండో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం అయ్యర్.. జట్టుతో కలవనున్నాడు. శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు కొత్త తలనొప్పి మొదలైంది.

ఇప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరికీ అవకాశం ఇవ్వాలి, ఎవర్నీ పక్కనపెట్టాలని సతమతమవుతున్న టీమిండియా.. శ్రేయస్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. టీమ్ కాంబినేషన్ నేపథ్యంలో ముఖ్యంగా మూడు సమస్యలు రోహిత్-ద్రవిడ్ ముందున్నాయి. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లో ఎవరిని ఆడించాలనేది తేల్చుకోలేకపోతుంది.

కేఎల్ రాహుల్‌కు లాస్ట్ చాన్స్..

కేఎల్ రాహుల్‌కు లాస్ట్ చాన్స్..

వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్‌ను కొనసాగించాలా? అనేది కూడా రోహిత్ సేన‌కు సవాల్‌గా మారింది. ఇక నాలుగో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలా? లేక బెంచ్‌కే పరిమితం చేయాలా? అనేదానిపై కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వాస్తవానికి విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించేందుకే టీమిండియా మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

శ్రేయస్ అయ్యర్ జట్టుతో కలవడం, తన హోమ్ గ్రౌండ్ అయిన ఢిల్లీ మ్యాచ్ జరుగుతుండటంతో జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అనేదానిపై సమాలోచనలు చేస్తోంది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నారు. రాహుల్‌కు ఇదే చివరి అవకాశం. ఇందులో విఫలమైతే అతను దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాల్సి ఉంటుంది.

 కేఎస్ భరత్‌పై వేటు..

కేఎస్ భరత్‌పై వేటు..

మూడో స్థానంలో 100వ టెస్ట్ ఆడనున్న చతేశ్వర్ పుజారా చోటుకు డోకాలేదు. కోహ్లీ సైతం నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం ఇవ్వచ్చు. అయ్యర్‌ను ఆడించాలనుకుంటే సూర్యపై వేటు తప్పదు. తొలిటెస్ట్ ఆడని శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే కేఎస్ భరత్‌తో పాటు సూర్యపై వేటు పడనుంది.

అప్పుడు గిల్ ఓపెనింగ్ చేస్తే.. మిడిలార్డ్‌లో రాహుల్ ఆడుతాడు. అతనే కీపింగ్ కూడా చేస్తాడు. గాయాలైతే తప్పా.. దాదాపు తొలి టెస్ట్‌ కాంబినేషన్‌నే కొనసాగించనున్నారు. కుల్దీప్‌కు కూడా మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. పేసర్లుగా సిరాజ్, మహమ్మద్ షమీలకు తిరుగు లేదు. దాంతో శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్

Story first published: Wednesday, February 15, 2023, 14:27 [IST]
Other articles published on Feb 15, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+