India Playing XI: రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఇషాన్ కిషన్‌పై వేటు! ఆసీస్‌తో రెండో వన్డే ఆడే భారత జట్టు ఇదే!

ముంబై: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా(India Playing XI) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం( మార్చి 19) సాగర తీరం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం (Vizag ODI) వేదికగా జరగనున్న రెండో వన్డేలో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంలో ఉంది.
మరోవైపు పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైన ఆస్ట్రేలియా.. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. వైజాగ్ మైదానం రికార్డులు భారత్‌కు అనుకూలంగా ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

రోహిత్ శర్మ రీఎంట్రీ..
బామ్మర్ది పెళ్లిన కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. తనకు అచ్చొచ్చిన అమ్మమ్మగారి ఊరిలో రోహిత్ బరిలోకి దిగుతుండగా.. అతని స్థానంలో తొలి వన్డే ఆడిన ఇషాన్ కిషన్(Ishan Kishan) వేటుకు గురికానున్నాడు.
రోహిత్ శర్మ అమ్మగారి ఊరు వైజాగ్ అనే విషయం అందరికి తెలిసిందే. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు. తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. రెండో వన్డేలో అయినా రాణించాలనే కసితో ఉన్నాడు.

సూర్యకు అగ్ని పరీక్ష..
తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దారుణంగా విఫలమయ్యారు. వారి స్థానాలకు డోకా లేకపోయినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. సూర్యకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షలాంటిది. టీ20 ఫార్మాట్‌లో సత్తా చాటుతున్న అతను వన్డేల్లో మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ముంబై వన్డేలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
వైజాగ్ వన్డేలో అతనికి చావో రేవో. విఫలమైతే.. అతని స్థానాన్ని మరో ఆటగాడు భర్తీ చేయనున్నాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. తొలి వన్డేలో అసాధారణ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. 6,7 స్థానాల్లో బరిలోకి దిగిన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రవీండ్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబర్చారు. అదే జోరును వైజాగ్ (Vizag ODI)లో కొనసాగిస్తే వారికి తిరుగుండదు.

కుల్దీప్ యాదవ్ డౌట్..
వైజాగ్ వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో బౌలింగ్ కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. టీమిండియా నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. తొలి వన్డేలో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ కొనసాగనుండగా.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా? లేక చాహల్‌ను తీసుకుంటారో చూడాలి. తొలి వన్డేలో కుల్దీప్ వికెట్ తీసినా ధారళంగా పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

భారత్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్/యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications