India Playing XI: గిల్ X సూర్య?.. కుల్దీప్ X అక్షర్ ? నాగ్‌పూర్ టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

నాగ్‌పూర్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ సన్నాహకాలను పూర్తి చేసుకొని తుది జట్టు ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. టీమిండియా తుది జట్టులో 7 స్థానాలు సెట్ అవ్వగా మరో నాలుగు ప్లేస్‌ల విషయంలో సందిగ్దత నెలకొంది. మరోవైపు జట్టు అవసరాలకు తగ్గట్లు ఆటగాళ్లను ఎంపిక చేస్తామని కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించాడు. 'టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు జట్టులో మార్పులు చేస్తామని మా ఆటగాళ్లకు స్పష్టంగా చెప్పాం. పిచ్ తగ్గట్లు అవసరమైన ఆటగాళ్లను తీసుకుంటామని తెలిపాం.'అని రోహిత్ స్పష్టం చేశాడు.

3 స్థానాలు ఆరుగురు పోటీ..
టీమిండియా తుది జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లకు చోటు ఖాయం. మిగతా నాలుగు స్థానాల మీదే చర్చ నడుస్తోంది. ఆ స్థానాల కోసం శుభ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ పోటీపడుతుండగా.. వీరిలో ముగ్గురు తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. అయితే వాళ్లెవరూ అనేదే ఇక్కడ చర్చ.

శుభ్‌మన్ గిల్ X సూర్యకుమార్ యాదవ్?
గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అవ్వడంతో అతని స్థానాన్ని భర్తీ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఈ ప్లేస్ కోసం శుభ్‌మన్ గిల్, సూర్య మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే గిల్ టెస్టుల్లో మూడు అర్థ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో వరుస సెంచరీలు బాదాడు. ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే గిల్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు సూర్య బెంచ్‌కు పరిమితమవుతాడు.
టీమ్‌లో పంత్ లేని నేపథ్యంలో దూకుడైన ప్లేయర్ కావాలనుకుంటే మాత్రం సూర్య ఆడుతాడు. అప్పుడు గిల్‌కు చోటు ఉండదు. రాహుల్ మిడిలార్డర్‌లోకి వస్తే గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ ఆడటం దాదాపు ఖాయం. కానీ పంత్‌లా ఆడే కీపర్ కావాలనుకుంటే ఇషాన్‌కు అవకాశం దక్కుతుంది.

మూడో స్పిన్నర్ ఎవరు..
మూడో స్పిన్నర్ ఎవరనేది కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ తేల్చుకోలేకపోతుంది. ఈ స్థానం కోసం అక్షర్ పటేల్, కుల్దీప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జడేజా, అక్షర్ బౌలింగ్ స్టయిల్ కాస్త దగ్గరదగ్గరగా ఉంటాయని.. అందుకే వైవిధ్యం కోసం కుల్‌దీప్‌కు చోటివ్వాలని చెబుతున్నారు. ఎలాంటి పిచ్ మీదనైనా బంతిని తిప్పేయడం అక్షర్ కంటే కుల్‌దీప్‌కే సాధ్యం. అయితే బ్యాటింగ్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటే అక్షర్‌కే ఎక్కువ అవకాశాలుంటాయి.

తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్),చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ శుబ్‌మన్ గిల్, కేఎస్ భరత్/ ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ / కుల్‌దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications