India Playing 11: బుమ్రా, షమీ ఇన్.. పంత్ డౌట్! ఆసీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే

హైదరాబాద్: ఆసియాకప్ 2022 వైఫల్యం అనంతరం టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా వచ్చే మంగళవారం(సెప్టెంబర్ 20)న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మొహాలీ చేరి ఆస్ట్రేలియా సన్నాహకాలు చేపట్టగా.. టీమిండియా ఆటగాళ్లు ఈ రోజే(శనివారం) జట్టులో చేరారు. మెగా టోర్నీకి ముందు టీమ్‌కాంబినేషన్ సెట్ చేసేందుకు టీమిండియా ఈ మ్యాచ్‌లను వాడుకోనుంది. దాంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బుమ్రా, హర్షల్ రీఎంట్రీ..
గాయాలతో ఆసియాకప్ 2022 టోర్నీకి దూరమైన స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరు తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. వీరి ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు వీరిని వీలైనన్ని మ్యాచ్‌లు ఆడించి మ్యాచ్ ప్రాక్టీస్ లభించేలా చూడనున్నారు. ఈ ఇద్దరికి తోడుగా భువనేశ్వర్ కుమార్ ఆడటం ఖాయం. సౌతాఫ్రికాతో సిరీస్‌కు భువీకి రెస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జరిగే మూడు మ్యాచ్‌లను భువీ ఆడనున్నాడు.

మహమ్మద్ షమీ డౌట్..
సుమారు 10 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమీకి అవకాశం దక్కడంపై సందేహాలు నెలకొన్నాయి. నలుగురు పేసర్లను తీసుకుంటే అతనికి అవకాశం దక్కవచ్చు. భారత్ పిచ్‌లు సాధారణంగా స్పిన్‌కు అనుకూలిస్తాయి కాబట్టి ఎక్స్‌ట్రా స్పిన్నర్ ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే అశ్విన్ జట్టులోకి వస్తాడు. అయితే టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా జరుగుతున్న సిరీస్ కాబట్టి గ్రీన్ ట్రాక్‌లను సిద్దం చేసే అవకాశం కూడా ఉంది. అలా చేస్తే మాత్రం మహమ్మద్ షమీ జట్టులోకి వస్తాడు. అక్షర్ పటేల్‌ను తీసుకున్నా మహమ్మద్ షమీ చోటుకు డోకా లేదు. దీపక్ చాహర్ మాత్రం నిరాశ తప్పేలా లేదు.

దినేశ్ కార్తీక్/రిషభ్ పంత్??..
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆడటం ఖాయం. అయితే ఆసియాకప్ ఫామ్‌ను వీళ్లు కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా సెంచరీతో చెలరేగిన కోహ్లీపై అందరి కళ్లున్నాయి. వికెట్ కీపర్ స్థానంలో ఎవరు ఆడుతారనేది తేలాల్సి ఉంది. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. టీమ్ కాంబినేషన్ దృష్ట్యా ఇద్దరిని ఆడించే పరిస్థితి లేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం పంత్‌ను ఆడించాల్సిన పరిస్థితి. అయితే అతను ఆసియాకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్‌ను ఆడించొచ్చు. దీపక్ హుడా, అక్షర్ పటేల్ విషయం కూడా తేల్చాల్సి ఉంది. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా చాహల్ ఆడటం ఖాయం.

తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్/దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా/అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహహ్మద్ షమీ/రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications