For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: రింకూ సింగ్‌కు నో ఛాన్స్.. ఆసీస్‌తో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

India Playing XI vs Australia: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ పరాజయం బాధ పచ్చిగా ఉండగానే టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మెగా ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియాతోనే సొంతగడ్డపై 5 టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 23(గురువారం)న వైజాగ్ వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.

ఈ సిరీస్‌కు ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లలో ముగ్గురు మినహా అందరూ దూరమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ, బుమ్రా, జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌, సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌‌లకు కూడా బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ప్రపంచకప్ జట్టులో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు టీమ్ సారథ్య బాధ్యతలు అప్పగించిన భారత సెలెక్షన్ కమిటీ.. ప్రసిధ్ కృష్ణ, ఇషాన్‌ కిషన్‌లను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేసింది.

India Playing XI vs Australia for 1st T20: Yashasvi Jaiswal IN and Rinku Singh OUT

శ్రేయస్ అయ్యర్ చివరి మూడు టీ20లకు అందుబాటులోకి వస్తాడని తెలిపింది. సోమవారమే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. ఈ సిరీస్‌లో టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. తొలి టీ20 జరిగే వైజాగ్‌కు మంగళవారమే టీమిండియా చేరుకోనుంది.

తొలి సారి సారథ్యం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు తుది జట్టు ఎంపిక సవాల్‌గా మారింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు తోడు ఎవరా? అనేది తలనొప్పిగా మారింది. యశస్వీ జైస్వాల్‌ను తీసుకోవాలా లేక ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలా? అనేది తేల్చుకోలేకపోతుంది. ఇషాన్ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగితే హిట్టర్ రింకూ సింగ్‌కు అవకాశం లభిస్తుంది.

అలా కాకుండా ఇషాన్ కిషన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనుకుంటే మాత్రం రింకూ సింగ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. తెలుగు తేజం తిలక్ వర్మ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయనుండగా.. సూర్యకుమార్ యాదవ్ నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. రింకూ సింగ్, శివమ్ దూబే హిట్టర్లుగా బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఆడనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ముఖేష్ కుమార్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

భారత తుది జట్టు(అంచనా)
రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ముఖేష్ కుమార్

టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత్ జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Story first published: Tuesday, November 21, 2023, 18:51 [IST]
Other articles published on Nov 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+